• ‘ఓం నమో వెంకటేశాయ’ టీజర్…
  Published Date : 25-Dec-2016 9:22:15IST

  అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా టీజర్ విడుదల అయ్యింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడి గా నటిస్తున్నారు. అనుష్క స్వామి వారి భక్తురాలి పాత్రలో నటిస్తున్న ఇందులో సౌరభ్ జైన్ వెంకటేశుడిగా నటిస్తున్నాడు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి పదో తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఇది వరకే ప్రకటించారు. టీజర్ కు మంచి స్పందన వస్తోంది.

  Read More
 • మణిరత్నం సినిమా ట్రైలర్ చాలా హాట్ గురూ!
  Published Date : 12-Dec-2016 1:30:05IST

  తెలుగులో విజయవంతం అయిన “ఓకే.. బంగారం’’ హిందీ రీమేక్ ‘’ఓకే జానూ’’ టీజర్ విడుదల అయ్యింది. లివింగ్ రిలేషన్ షిప్ కాన్సెప్ట్ మీద రూపొందించిన ఈ సినిమా హిందీ వెర్షన్ యమహాట్ గా ఉంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్, శద్ధా కపూర్ లు నటించిన ఈ సినిమా ను హిందీలో మణిరత్నం, కరణ్ జొహార్ లు కలిసి నిర్మించారు. హీరోహీరోయిన్ల మధ్య సాన్నిహిత్యపు సీన్లు రొటీన్ గానే హీటెక్కించాయి. తెలుగు, తమిళ వెర్షన్లలో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను హిందీలో నసీరుద్ధీన్ షా చేశారు.

  Read More
 • తమిళ సినిమా.. సంక్రాంతి సందడి మొదలైంది!
  Published Date : 28-Oct-2016 11:45:06IST

  ఇంకా పొంగల్ కు రెండున్నర నెలల సమయం ఉండగానే.. తమిళ సినిమా వాళ్ల సంక్రాంతి సందడి మొదలుపెట్టేశారు. తెలుగు నాట సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలు ఇంకా పూర్తి సందడి మొదలు పెట్టకనే తంబీలు మాత్రం టీజర్లు విడుదల చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న విజయ్ సినిమా “భైరవ’’ టీజర్ నిన్న రాత్రి విడుదల అయ్యింది. యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్. భరతన్ దర్శకత్వంలో భరత్ రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నటిస్తున్నాడు.

  Read More

 • Widget not in any sidebars
 • కండోమ్ యాడ్ లో కుమ్మేసిన క్రికెటర్లు..!
  Published Date : 26-Oct-2016 11:14:01IST

  వెస్టిండీస్ క్రికెటర్లు డ్వాన్ బ్రావో, క్రిస్ గేల్ లు మైదానంలో ఆటతోనే కాదు.. అక్కడే తమ డాన్స్ మూమెంట్స్ తో కూడా వీళ్లు ఇప్పటికే అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. వీళ్లలోని ఆ టాలెంట్ ను ఒక కండోమ్ కంపెనీ వాడేసుకుంటోంది. వీళ్లను బ్రాండ్ అంబాసిడర్లు నియమించుకున్న ఆ సంస్థ వీళ్లపై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించింది. ‘చాంఫియన్..’ అంటూ సాగే ఆ పాటకు అనుగుణంగా గేల్,బ్రావోలు చిందేశారు. తన డాన్స్ టాలెంట్ ను ప్రదర్శించుకోవడానికి కండోమ్ యాడ్ మంచి అవకాశంగా నిలిచిందని గేల్ అన్నాడు.

  Read More
 • హీరోయిన్ షేవింగ్ చేయించుకుంది!
  Published Date : 25-Oct-2016 7:00:35IST

  పూరీ జగన్నాథ్ ‘బుజ్జిగాడు’ తో తెలుగు వారికి దగ్గరై.. ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా నటించిన సంజన షేవింగ్ చేయించుకుని.. ఆ వీడియోను ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేసి ఆశ్చర్యపరిచింది. మరి హీరోయినేంటి.. షేవింగ్ చేయించుకోవడమేమిటి.. అంటే, మొహంపై అవాంఛిత రోమాల తొలగింపుకు ఆమె ఈ పని చేసింది. ఒకవైపు కొంతమంది హీరోయిన్లు అవాంఛిత రోమాల తొలగింపుకు రేజర్లు వాడొద్దు అంటూ యాడ్స్ చేస్తుంటే సంజన మాత్రం షేవింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరించడం గమనార్హం.

  Read More
 • ‘వంగవీటి’ షాట్స్ కొన్ని విడుదల చేసిన వర్మ!
  Published Date : 11-Oct-2016 8:42:33IST

  విడుదలకు ముందే ‘వంగవీటి’ సినిమాకు సంబంధించిన కొన్ని షాట్స్ ను ఇంటర్నెట్లో పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. తన అధికారిక యూట్యూబ్ చానల్ ద్వారా వర్మ వాటిని విడుదల చేశాడు. విజయవాడలో ఒకప్పుడు.. అనే థీమ్ తో అక్కడ రౌడీ ముఠాల మధ్య తగదాలను ఈ సినిమాను తెరకెక్కించాడు. డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. దసరా కానుకగా ఈ సినిమా షాట్స్ టీజర్ ను వర్మ విడుదల చేశాడు. తద్వారా తన సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే యత్నం చేస్తున్నాడు.

  Read More

 • Widget not in any sidebars
 • ఓటేయమంటూ.. నగ్న ప్రచారం..!
  Published Date : 29-Sep-2016 10:40:37IST

  పోలింగ్ బూత్ లోకి నగ్నంగా ప్రవేశించకూడదని.. ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నిస్తోంది కేటీ పెర్రీ. యూఎస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కెటీ ఓటింగ్ మీద అవగాహన కల్పించడానికన్నట్టుగా ఒక మ్యూజిక్ వీడియోను రూపొందించింది. ఇందులో ఆమె నగ్నంగా నటించేసింది! ఫన్నీ ఆర్ డై పేరుతో రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు వచ్చి ఓటు వేయాలని, తనకు మాత్రం నగ్నంగా ఓటు వేయడమే ఇష్టమని కేటీ సందేశమిస్తోంది.

  Read More
 • అందరి కంటే నేనే తెలివైన వాడిని: బాబు
  Published Date : 25-Sep-2016 8:17:47IST

  మొన్నేమో దేశంలో నేనే నంబర్ వన్ సీఎంని.. అని ప్రకటించుకున్నాడు. అదే సమయంలో తను ‘నిప్పు’ ని అని కూడా మరోసారి నొక్కి వక్కాణించాడు.నిన్నేమో.. “అందరి కంటే నేనే తెలివైన వాడిని..’’ అనే ప్రకటన కూడా చేసేశారు.. ప్రత్యేకించి కేంద్రం కంటే తనే తెలివైన వాడిని అని కూడా ఏపీ సీఎం ప్రకటించేసుకున్నాడు. ప్రత్యేకహోదా- ప్యాకేజీ అంశంపై స్పందిస్తూ బాబుగారు తను తెలివైన వాడిని అనే విషయాన్ని ప్రకటించుకున్నాడు. కాబట్టే తను ప్యాకేజీ వైపు మొగ్గు చూపానని చెప్పుకున్నాడు!

  Read More
 • రజనీని కలిసిన.. మహేంద్ర సింగ్ ధోనీ!
  Published Date : 23-Sep-2016 8:22:33IST

  తన బయోపిక్ ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన ధోనీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సమావేశం అయ్యాడు. “ఎమ్ఎస్ ధోనీ’’ పేరుతో రూపొందిన ధోనీ బయోపిక్ ఈ నెల ఆఖర్లో విడుదల కానుండటం విదితమే. ఈ సినిమాను దక్షిణాది ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువదించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ప్రచార పర్వాన్ని నిర్వహిస్తోంది. రజనీకాంత్ తో తను కలిసిన వీడియోను ధోనీ ఫేస్ బుక్ ద్వారా పోస్టు చేశాడు. ధోనీ వెంట అతడి బయోపిక్ నటీనటులు కూడా ఉన్నారు.

  Read More

 • Widget not in any sidebars
 • ఫిరాయింపులపై మూడు నెలల్లో తేల్చండి!
  Published Date : 21-Sep-2016 12:18:46IST

  తమ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయిన ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు చేసింది న్యాయస్థానం. ఈ ఆదేశాలు ఫిరాయింపుదారులను ఇబ్బంది పెట్టేవే అవుతాయి. ఫిరాయింపుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ స్పీకర్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటారో! ప్రభుత్వం అయితే ఫిరాయింపులపై చర్యలకు సుముఖంగా లేదు.

  Read More
 • వారెవ్వా.. సురేఖ వాణి!
  Published Date : 20-Sep-2016 8:11:10IST

  క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో జీవించేయడమే కాదు… డాన్స్ తోనూ దుమ్మురేపగలనని నిరూపించుకుంది సురేఖా వాణి. తన కూతురుతో పోటీ పడుతూ… నిక్కరేసుకుని సురేఖ చిందేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. బాలీవుడ్ తాజా సినిమా “బార్ బార్ దేఖో’లో కత్రినాకైఫ్ నర్తించిన పాటకు సురేఖ డాన్స్ చేసింది. ఈ పాటకు తన కూతురుతో కలిసి నర్తించింది సురేఖ. హోమ్లీ పాత్రల్లో కనిపించే ఆమె ఇలా డాన్సు చేయడం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

  Read More
 • పుణే గణేష్ భక్తజనానికి హ్యాట్సాఫ్!
  Published Date : 20-Sep-2016 4:08:32IST

  వినాయక నిమజ్జనం..ఇసుకేస్తే రాలనంత జనం.. అంతటా కోలాహలం.. ఉత్సాహవంతంగా శోభా యాత్ర జరుగుతున్న ఆ రోడ్డు వెంట వేరే వాహనాల ప్రయాణానికి అవకాశమే లేదు, దారి దొరకదు. అలాంటి సమయంలో అటుగా వచ్చిందొక అంబులెన్స్! ఆ సైరన్ వినపడగానే శోభాయాత్రలోని భక్తజనులు అలర్ట్! అంతటి జనసంద్రం చీలిపోయింది! అంబులెన్స్ కు దారి ఇచ్చింది. అన్ని వేల మంది అంత త్వరగా రెస్పాండ్ కావడం నిజంగా చాలా గొప్ప. భక్తే కాదు, మానవత్వం కూడా ఉందని నిరూపించుకున్న పుణే భక్తజనానికి హ్యాట్సాప్!

  Read More

 • Widget not in any sidebars
 • సిక్సర్ల వర్షం కురిసింది ఈ రోజే!
  Published Date : 19-Sep-2016 12:14:25IST

  ఆరు బంతులకు ఆరూ సిక్సర్లే! క్రికెట్ లో అత్యంత అరుదైన ఫీట్. భారత క్రికెట్ అభిమానులు జీవిత కాలం మరిచిపోలేని మధురానుభూతి. తొలి టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో యువరాజ్ సిక్సర్ల మోత మోగించింది ఇదే రోజు. కచ్చితంగా 9సంవత్సరాల కిందట యువీ క్రికెట్ లో తన కంటూ ప్రత్యేక పుటలను లిఖించుకున్నాడు. బ్రాడ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాడు. తొలి టీ 20 ప్రపంచకప్ సాధనలో కీలకమైన విజయంలో యువీ కీలకపాత్ర పోషించాడు.

  Read More
 • సూర్య ట్రైనింగ్ లో జ్యోతిక బైక్ రైడ్!
  Published Date : 14-Sep-2016 3:29:53IST

  సెలబ్రిటీలు స్వేచ్ఛయుత జీవితం గడపడం కాస్తంత కష్టమే. పదుగురి మధ్యకు వచ్చారంటే జనాలు చుట్టుముట్టేస్తారు. ఇలాంటి పరిస్థితిపై అవగాహన ఉన్న వాళ్లు సరదాగా గడపడానికి కొన్ని మార్గాలను ఎంచుకోవడం అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తూ ఉంటుంది. తాజాగా తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతికకు బైక్ నడపడం నేర్పించడానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు ఎప్పటివో కానీ, హెల్మెట్లు ధరించి ఎవరూ గుర్తు పట్టకుండా రోడ్ల పై విహరించినట్టున్నారు ఆ భార్యభర్తలు. వారి అభిమానులను అలరిస్తున్నాయివి.

  Read More
 • ‘నిర్మలా కాన్వెంట్’ ను రూ.14 కోట్లకు అమ్మేశారా!
  Published Date : 12-Sep-2016 4:42:24IST

  హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా “నిర్మలా కాన్వెంట్’’. దీనికి తోడు ఈ సినిమాకు అనేక హంగులూ, ఆర్భాటాలున్నాయి. ఈ నేపథ్యంలో మంచి అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమాను ఏకంగా రూ.14 కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. దీని మేకింగ్ కు ఐదు కోట్లు ఖర్చు పెట్టారని, నాగ్ పారితోషకం ఐదు కోట్లతో కలుపుకుంటే మొత్తం పది కోట్లు అయ్యిందని, నాలుగు కోట్ల లాభానికి ఈ సినిమాను అమ్మేశారని వినికిడి. మరి ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

  Read More