• అనుష్కతో బంధంపై స్పందించిన విరాట్

    Published Date : 04-Nov-2017 3:56:30 IST

    అనుష్క శర్మతో తన బంధం గురించి స్పందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ. కొన్నేళ్లుగా వీరిద్దరూ ఓపెన్ గానే రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్కతో తన బంధాన్ని ఇలా మార్చుకోవడానికి జహీర్ ఖాన్ ఇచ్చిన సలహానే కారణమని విరాట్ చెప్పాడు. అనుష్కతో బంధాన్ని దాచడానికి ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది, ఓపెన్ గా ఉంటే ఏ తలనొప్పీ ఉండదని జహీర్ తనకు సూచించాడని.. అందుకే తమ బంధాన్ని దాచలేదని విరాట్ చెప్పాడు. తను ఎప్పుడు ఫెయిలయినా అనుష్కను నిందించడం బాధను కలిగిస్తుందన్నాడు.

Related Post