• భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి పట్ల విముఖత!

    Published Date : 02-Jun-2017 10:44:35 IST

    కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలగడం దాదాపు ఖాయమైంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ తో విబేధాల నేపథ్యంలో కుంబ్లే కోచ్ పదవి నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కొత్త కోచ్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. తిరిగి కోచ్ పదవి కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి కుంబ్లే ఏ మాత్రం ఆసక్తితో లేనట్టుగా సమాచారం. దీంతో కొత్త వ్యక్తి కోచ్ గా రావడం ఖాయమైనట్టే. ఆసీస్ మాజీ ఆటగాడు టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు రేసులో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెహ్వాగ్ కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Post