• మరో క్రికెటర్ బయోపిక్..?
    Published Date : 15-May-2017 9:56:29 IST

    భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ఇప్పటి వరకూ ముగ్గురి బయోపిక్స్ వచ్చినట్టే. అజహర్, ధోనీల తర్వాత సచిన్ బయోగ్రఫీ సినిమా గా తయారైంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరు వినిపిస్తోంది. అది మరెవరిదో కాదు.. రాహుల్ ద్రావిడ్ సినిమా. మిస్టర్ డిపెండబుల్ గా ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకతను కలిగిన ద్రవిడ్ బయోపిక్ ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఆసక్తిని రేకెత్తించగల బయోపిక్ అవుతుంది ద్రావిడ్ సినిమా. మరి ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.