• ధవన్, రోహిత్ కొత్త రికార్డు!

    Published Date : 01-Nov-2017 8:36:58 IST

    ఢిల్లీలో న్యూజిలాండ్ తో జరిగిన టీ20లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ లు కొత్త రికార్డును స్థాపించారు. ఓపెనింగ్ పార్టనర్ షిప్ విషయంలో ఇండియా తరఫు నుంచి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. తొలి వికెట్ కు 158 పరుగులు సాధించింది ఈ జంట. ఇది వరకూ ఈ రికార్డు సెహ్వాగ్ గంభీర్ ల పేరు మీద ఉండేది. ఆ ఢిల్లీ జోటీ 146 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ రికార్డును కలిగి ఉండేది. ధవన్, రోహిత్ లు ఆ రికార్డును బద్ధలు కొట్టారు. 80 పరుగుల వద్ద ధవన్ ఔట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.

Related Post