• ఆసీస్ ఓడిన చోట బంగ్లా గెలిచింది..!

    Published Date : 20-Mar-2017 7:06:35 IST

    టెస్టు హోదాను పొందిన తర్వాత ఆడిన వందో టెస్టును చిరస్మరణీయంగా మార్చుకుంది బంగ్లాదేశ్. శ్రీలంకను శ్రీలంక మీద ఓడించి.. బంగ్లా సంచలనం సృష్టించింది. తన సొంత గడ్డ మీద శ్రీలంక ఎంత పటిష్టమైన జట్టో వివరించనక్కర్లేదు. ఇటీవల ఆ దేశంలో పర్యటించిన ఆసీస్ కూడా శ్రీలంక చేతిలో చిత్తు అయ్యింది. బంగ్లా తన వందో టెస్టును శ్రీలంక మీద దాని సొంతగడ్డ మీద ఆడి నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా టెస్టు హోదా కలిగిన మరో జట్టుపై విజయాన్నిసొంతం చేసుకుంది.

Related Post