• సెహ్వాగ్‌ను భయపెట్టిన బౌలర్ అతడే!
  Published Date : 12-Oct-2017 9:12:14IST

  వీరేంద్ర సెహ్వాగ్ కు డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ గా పేరు. బౌలర్ ఎవరనేది, మ్యాచ్ ఎక్కడ, పరిస్థితులు ఏవి.. అనేవి సెహ్వాగ్ కు పట్టింపు ఉండే విషయాలు కావు. 99 పరుగుల వద్ద కూడా సిక్స్ కొట్టడానికి యత్నించగల డేర్ అతడు. సిక్స్ తో ట్రిపుల్ హండ్రెడ్ చేసిన ఘనుడు. అంత డేర్ అయిన వీరుకు కూడా ఒక బౌలర్ అంటే భయమట. అతడు బౌలింగ్ కు దిగితే ఔట్ అవుతానేమో అని భయపడే వాడట. అలా వీరును భయపెట్టిన బౌలర్ మరెవరో కాదు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్యమురళీధరన్. మురళీకి తను భయపడ్డ వైనం గురించి దాచుకోకుండా వివరించాడు వీరూ.

  Read More
 • కెరీర్ లో టఫ్ టైమ్ అదే: సచిన్
  Published Date : 12-Sep-2017 6:13:40IST

  తన 24 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ లో టఫ్ టైమ్ అంటే అది 2007 ప్రపంచకప్ సమయమే అన్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆ ప్రపంచకప్ లో భారత్ శ్రీలంక, బంగ్లాదేశ్ ల చేతుల్లో ఓడి.. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. తాము దిశానిర్దేశం లేకుండా ఆడామని, ఎందుకు ఆడుతున్నామో కూడా తెలియనట్టుగా ఆడామని సచిన్ అన్నాడు. బెస్ట్ టైమ్ అంటే అది 2011 ప్రపంచకప్ గెలవడమే అని సచిన్ వ్యాఖ్యానించాడు.

  Read More
 • కొహ్లీ.. సచిన్ కన్నా ముందే, సచిన్ ను దాటేస్తాడా?
  Published Date : 04-Sep-2017 4:46:27IST

  30 సెంచరీలను సాధించడానికి సచిన్ కు 280 వన్డేలు పట్టాయి. అయితే కొహ్లీ మాత్రం 194వ వన్డేలోనే 30 సెంచరీలను పూర్తి చేశాడు. ఇన్ని సెంచరీలు చేయడానికి రికీపాంటింగ్ వంటి స్టార్ బ్యాట్స్ మన్ కు కెరీర్ అంతా పట్టింది. మరి కొహ్లీ దూకుడు చూస్తుంటే.. అతడు సచిన్ సాధించిన 49 వన్డేల రికార్డును అధిగమించడానికి మరెంతో ఎక్కువ సమయం పట్టదని చెప్పాల్సి వస్తోంది. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు కొహ్లీ పేరు మీదికి ట్రాన్స్‌ఫర్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది.

  Read More

 • Widget not in any sidebars
 • ఐపీఎల్ ప్రసార హక్కులు..కళ్లు చెదిరే మొత్తానికి!
  Published Date : 04-Sep-2017 4:43:53IST

  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రసార హక్కులను హోల్ సేల్ గా స్టార్ ఇండియా దక్కించుకుంది. ఏకంగా 16,347 కోట్ల రూపాయల మొత్తానికి వేలం పాడి ఐదేళ్లకు గానూ ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఏడాదికి 3,270 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ప్రసార హక్కులను తీసుకుంది స్టార్. అనేక మీడియా కంపెనీలు ఈ వేలంలో పోటీపడగా.. అత్యధిక మొత్తాన్ని కోట్ చేసిన స్టార్ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. ఈఎస్పీఎన్, ఫేస్ బుక్, ట్విటర్, టైమ్స్ తదితర సంస్థలు కూడా హక్కుల కోసం పోటీ పడ్డాయి.

  Read More
 • కొహ్లీ కమాల్.. కొత్త రికార్డులు దాసోహం!
  Published Date : 30-Jul-2017 11:55:45IST

  వన్డేలు, టెస్టులు, టీ20లు.. మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ 50 పరుగులు సగటును సాధించిన క్రికెటర్ గా కొత్త రికార్డు స్థాపించాడు విరాట్ కొహ్లీ. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఒక్కరికీ ఇలాంటి ఘనత లేదు. మూడు ఫార్మాట్లలో 50 పరుగుల సగటును కలిగిన క్రికెటర్ ఇంకోరు లేరు. అంతే కాదు..విదేశాల్లో వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కూడా కొహ్లీ రికార్డు క్రియేట్ చేశారు. ఇటీవలే చేజింగ్ లో అత్యధిక సెంచరీలు(17) సాధించిన క్రికెటర్ గా కూడా కొహ్లీ రికార్డు స్థాపించాడు.

  Read More
 • సంచలనం: ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా..!
  Published Date : 21-Jul-2017 10:40:49IST

  ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో భారత మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ప్రపంచకప్ ఫైనల్ లో అడుగు పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 42 ఓవర్లకే 286 పరుగుల భారీ స్కోరును సాధించింది. లక్ష్య చేధనలో ఆసీస్ వెనుకంజ వేసింది. ఓటమి పాలైంది. భారత్ విమెన్ ప్రపంచకప్ లో ఫైనల్ కు చేరడం ఇది రెండో సారి. ఫైనల్ లో టీమిండియా ఇంగ్లండ్ తో తలపడనుంది. ఆదివారం ఫైనల్ జరగనుంది.

  Read More

 • Widget not in any sidebars
 • సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కొహ్లీ
  Published Date : 07-Jul-2017 11:27:00IST

  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డుల్లో ఒక్కొక్కదాన్నీ బ్రేక్ చేస్తూ వెళ్తున్నాడు విరాట్ కొహ్లీ. ఇప్పుడు ఒక్క సెంచరీ చేస్తూ వెళ్తున్న కొద్దీ విరాట్ ఏదో ఒక రికార్డును బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ కొట్టిన విరాట్ దీని ద్వారా చేజింగ్ లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. చేజింగ్ లో సచిన్ 17 సెంచరీలు చేయగా, విరాట్ 18 సెంచరీ పూర్తి చేశాడు. ఇది వన్డేల్లో విరాట్ కు 28వ సెంచరీ.

  Read More
 • సినీ స్టార్లను దాటేసి.. మోడీ తర్వాతి స్థానంలో..!
  Published Date : 26-Jun-2017 12:42:45IST

  ఫేస్ బుక్ ఫాలోయర్ల విషయంలో సరి కొత్త ఫీట్ ను సాధించాడు విరాట్ కొహ్లీ. ఏకంగా మూడు కోట్లా యాభై ఏడు లక్షల మంది పై స్థాయిలో ఫాలోయర్లతో విరాట్ కొత్త హైట్స్ కు చేరాడు. ఈ విషయంలో మోడీ తర్వాతి స్థానంలో నిలిచాడు విరాట్. ప్రధాని ఫేస్ బుక్ పేజీకి గానూ నాలుగు కోట్ల మంది ఫాలోయర్లను కలిగి ఉండగా విరాట్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. సల్మాన్ మూడో స్థానంలో ఉన్నాడు, విరాట్ కన్నా ఆరు లక్షల మంది తక్కువ ఫాలోయర్లను కలిగి ఉన్నాడు సల్లూ.

  Read More
 • క్రికెట్ లో మరో రెండు దేశాలకు టెస్టు హోదా!
  Published Date : 23-Jun-2017 10:14:52IST

  తమ ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న రెండు దేశాల క్రికెట్ జట్లు టెస్టు హోదాను పొందాయి. ఈ మేరకు ఐసీసీ వాటికి టెస్టు హోదాను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇలా ప్రమోషన్ పొందాయి ఐర్లాండ్, అప్ఘానిస్తాన్ క్రికెట్ జట్లు. ఐర్లాండ్ జట్టు చాలా కాలం నుంచి మంచి ఆట తీరును ప్రదర్శిస్తోంది. టెస్టు హోదా కలిగిన జట్లను ఓడించి సత్తాచాటింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అప్ఘానిస్తాన్ తన సత్తా చూపెడుతోంది. ఇప్పుడు టెస్టు హోదా కూడా పొంది సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది.

  Read More

 • Widget not in any sidebars
 • టీమిండియాపై ఫ్యాన్స్ ఫైర్.. పోస్టర్ల దగ్ధం!
  Published Date : 19-Jun-2017 2:44:06IST

  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా పాక్ చేతిలో ఓడటం పట్ల భారత క్రికెట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అహ్మదాబాద్‌లో కొంత మంది టీవీలు రోడ్డు మీదకు తెచ్చి బద్దలు కొట్టారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్పూర్‌లో కెప్టెన్‌ కోహ్లి, అశ్విన్‌, యువరాజ్‌ సింగ్‌, ఇతర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో క్రికెట్‌ ప్రేమికుల ఆగ్రహానికి టీవీలు పగిలిపోయాయి. టీమిండియా సభ్యుల ఆటతీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాంచిలోని మహేంద్ర సింగ్‌ ధోని ఇంటి వద్ద భద్రతను పెంచారు.

  Read More
 • ఇండియా, పాక్ మ్యాచ్.. యాడ్ రేట్ యమ కాస్ట్!
  Published Date : 17-Jun-2017 4:59:03IST

  తలపడేది ఇండియా పాకిస్తాన్ లు.. దీంతో కొన్ని కోట్ల మందికి ఈ మ్యాచ్ ఆసక్తిని రేపే అంశం అవుతోంది. మరి ఇదే సమయంలో ఇది వందల కోట్ల వ్యవహారం కూడా. ప్రత్యేకించి ఈ మ్యాచ్ ను లైవ్ గా ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ కోట్ల రూపాయలను పోగేసుకుంటోంది. పది సెకన్ల యాడ్ కు ఏకంగా ఇరవై లక్షల రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తోందట. ఛాంపియన్స్ ట్రోఫీలోని ఇతర మ్యాచ్ లతో పోలిస్తే ఈ రేటు ఐదు రెట్లు ఎక్కువ!

  Read More
 • ఇండియా.. ఇక పాక్ తోనే అమీతుమీ!
  Published Date : 15-Jun-2017 9:39:17IST

  ద్వైపాక్షిక సీరిస్ లు ఆడటం మానేసిన ఇండియా, పాక్ లు మరో రసవత్తర పోరుకు సిద్ధం అవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఇండియా పాక్ లు తలపడటం ఖాయమైంది. సెమిస్ లో ఇంగ్లండ్ పై పాక్ విజయం సాధించగా, ఇండియా బంగ్లాపై విజయం సాధించింది. దీంతో.. ఫైనల్ ఇండియా, పాక్ ల మధ్య ఖరారైంది. ఇదే ట్రోఫీలో ఇండియా, పాక్ లు లీగ్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఫైనల్ లో ఈ రెండు జట్ల పోరాటం ఆసక్తిని రేపుతోంది. ఐసీసీ టోర్నీలో పాక్ పై ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది.

  Read More

 • Widget not in any sidebars
 • ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మరో ఫైనల్ మ్యాచ్?
  Published Date : 14-Jun-2017 10:17:56IST

  ఛాంపియన్స్ ట్రోఫీ సెమిఫైనల్ లో పాకిస్తాన్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమిస్ లో టీమిండియా, బంగ్లాలు తలపడనున్న సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో ఇండియా బంగ్లాను ఓడించే అవకాశాలున్నాయి. దీంతో ఇండియా, పాక్ ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది వరకూ ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ సంపూర్ణ ఆధిక్యతను కనబరిచింది, మరో ఆసక్తికరమైన మ్యాచ్ కు తెరలేచేలా ఉందిప్పుడు.

  Read More
 • కొహ్లీ ఇగోపై మరో దెబ్బ పడిందా!
  Published Date : 10-Jun-2017 8:45:14IST

  టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన ఇగోతో కోచ్ కుంబ్లేతో గొడవ తెచ్చుకున్నాడు. విజయవంతమైన కోచ్ అయినప్పటికీ కుంబ్లేను సాగనంపడానికి రంగం సిద్ధం చేశాడు. కుంబ్లే కోచ్ గా ఉండటం కొహ్లీకి ఏ మాత్రం ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. అయితే బీసీసీఐ పెద్దలు, మాజీలు మాత్రం కొహ్లీకి పూర్తిగా సహకరించడం లేదు. ఇప్పటికిప్పుడు కుంబ్లేని తొలగించే ఉద్దేశం లేదని బీసీసీఐ పెద్దలు స్పష్టం చేశారని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విండీస్ తో సీరిస్ కు కూడా కుంబ్లేనే కోచ్ గా కొనసాగే అవకాశాలున్నాయి. మరి కొహ్లీ ఇగోపై ఇది పెద్ద దెబ్బేనేమో!

  Read More
 • టీమిండియానే ఫేవరెట్ అన్న ఆసీస్ మాజీ!
  Published Date : 08-Jun-2017 9:35:46IST

  గత కొంతకాలంగా టీమిండియా క్రికెట్ ద్వారా మంచి వినోదాన్ని పంచుతోందని అన్నాడు ఆసీస్ మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ. అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా మంచి క్రికెట్ ఆడుతోందని లీ అన్నాడు. ఇండియా మ్యాచ్ లను చూడటాన్ని తను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని లీ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియానే నెగ్గుతుందని లీ వ్యాఖ్యానించాడు. ఇండియా కాకపోతే ఆస్ట్రేలియా ట్రోఫీని గెలవాలని తాను కోరుకుంటున్నానని లీ అన్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ లలో సమతుల్యతతో ఉన్న ఇండియాకే ఛాన్సులున్నాయని లీ అభిప్రాయపడ్డాడు.

  Read More