• తండ్రి కాబోతున్న మరో యువహీరో!

    Published Date : 31-Jan-2017 8:46:53 IST

    మరో నాలుగు నెలల్లో తను తండ్రిని కాబోతున్నాను అని తెలిపాడు హీరో నాని. తండ్రులవుతున్న యువ హీరోల జాబితాలో తను కూడా ఉన్నానని ధ్రువీకరించాడు. తను ఇంకా చిన్న పిల్లాడినే అని, తండ్రి పాత్రలో తనను తాను ఊహించుకోలేకపోతున్నాను అని.. ఈ హీరో చమత్కరించాడు. ప్రస్తుతం ‘నేను లోకల్’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇందులో తను స్టూడెంట్ గా నటిస్తున్నాను అని తెలిపాడు. నిజజీవితంలో పెద్దగా చదువుకోలేదని, సినిమా లేకపోతే తను జీరో అని నాని అన్నాడు.

Related Post