• వెంకీతో ఆగింది, రామ్ తో పట్టాలెక్కుతోంది!

    Published Date : 30-Jan-2017 10:32:33 IST

    ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ సినిమా ఎంతకూ పట్టాలెక్కపోవడంతో రామ్ తో సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట దర్శకుడు కిషోర్ తిరుమల. ‘నేను శైలజ’ సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు వెంకీతో సినిమా చేయడం గురించి చాన్నాళ్ల నుంచే సమాలోచనలు జరుపుతున్నాడు. అయితే ఈ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తన గత చిత్ర హీరో రామ్ తో ఒక సినిమాను ప్రతిపాదన దశలోకి తీసుకొచ్చాడట కిషోర్ తిరుమల. రామ్ కూడా ఈ దర్శకుడితో సినిమాపై ఆసక్తితోనే ఉన్నాడు.

Related Post