• మరణదండన.. ‘ఉరి’వద్దు..మరోలా చంపండి!

    Published Date : 07-Oct-2017 10:30:59 IST

    తీవ్రమైన శిక్ష మరణదండనను అమలు పర్చేందుకు కొత్త మార్గాలను వెతకాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మెడకు తాడు వేసి ఉరి తీయడం క్రూరమైన పద్ధతి అని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మరణంలో శాంతి ఉండాలని అందుకే.. మరణదండనను అమలు చేయడంలో మరో పద్ధతిని కనుగొనాలని కోర్టు సూచించింది. కొన్ని దేశాల్లో ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి తీవ్రమైన నేరాల దోషులను చంపే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా చనిపోయే మార్గాన్ని వెదకాలని భారత సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Related Post