• బ్రిటన్ యువరాజు, హాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!

    Published Date : 27-Nov-2017 6:39:09 IST

    బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ వివాహం హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ తో జరగబోతోంది. ఇప్పటికే వీరు ప్రేమ జంటగా పేరు పొందారు. వీరి పెళ్లి జరగబోతోందని హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ ప్రకటించారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగిందని చార్లెస్ ప్రకటించారు. పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలూ ఓకే చెప్పారని.. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగబోతోందని చార్లెస్ ప్రకటించారు. మేఘన్ కు ఇది రెండో పెళ్లి. ఇది వరకే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందామె.

Related Post