• అసాంజేకు స్వేచ్ఛ లభించినట్టేనా..?
  Published Date : 19-May-2017 9:45:38 IST

  స్వీడన్ లోతనపై నమోదైన రేప్ కేసు నుంచి వికీలీక్స్ వ్యవస్థాపకడ జూనియన్ అసాంజేకు విముక్తి లభించింది. ఈ కేసుపై విచారణ, ధర్యాప్తులను పూర్తిగా నిలిపేస్తున్నట్టుగా స్వీడన్ కోర్టు ప్రకటించింది. దీంతో అసాంజేపై నమోదైన కేసు నుంచి ఊరట లభించింది. గత ఐదేళ్లుగా అసాంజే లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న విషయం విదితమే. అయితే ఈ కేసు కొట్టివేయడంతో.. అసాంజే ఎంబసీ నుంచి బయటకు రాగలడా? అనేదానిపై క్లారిటీ లేదు.

  Click Here To Read Full Article
 • టెండూల్కర్ ప్రేమ కథ క్లారిటీ వస్తుందట!
  Published Date : 16-May-2017 8:29:10 IST

  సచిన్ వైవాహిక జీవితం చాలా ప్రత్యేకం అని క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసులో తన కన్నా నాలుగు సంవత్సరాల పెద్దదైన డాక్టర్ అంజలిని సచిన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వయసులో తమ కన్నా పెద్ద వాళ్లైన అమ్మాయిలను ప్రేమించే వాళ్లకు ఆదర్శం అయ్యాడు టెండూల్కర్. అనేక మంది సచిన్ పెళ్లిని ఉదాహరిస్తూ ఉంటారు. మరి అలాంటి తన ప్రణయగాథ వివరాలు పూర్తిగా తెలుస్తాయని, త్వరలోనే విడుదల కానున్నతన బయోపిక్ లో తన ప్రేమకథ ప్రస్తావన ఉంటుందని టెండూల్కర్ చెప్పారు.

  Click Here To Read Full Article
 • ఐపీఎల్ యాడ్ రేట్.. సెకనుకు అంత కాస్టా!
  Published Date : 03-Apr-2017 10:18:24 IST

  ఐపీఎల్ లో టీవీ యాడ్స్ కు సంబంధించి అత్యంత భారీ నంబర్లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన టీవీ చానల్ యాడ్ కు సంబంధించిన వేలం నిర్వహించగా, భారీ నుంచి అతి భారీ నంబర్లు పలికాయి. మ్యాచ్ సందర్భంగా పది సెకనుల యాడ్ కు ఐదు లక్షల రూపాయల వరకూ చెల్లించుకోవాల్సి ఉంటుందట. ప్రతి మ్యాచ్ కూ 2,300 సెకనుల యాడ్ సమయాన్ని తేల్చారట. దీన్ని బట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రత్యక్ష సారం చేసే చానల్ పంట పండినట్టే.

  Click Here To Read Full Article
 • లారెన్స్.. ఒక మంచి పని!
  Published Date : 02-Apr-2017 10:24:24 IST

  సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ పరంపరలో లారెన్స్ మరో మంచి పని చేశారు. తమిళనాడులో రైతుల పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన లారెన్స్.. అక్కడ కొంతమంది రైతులకు పాడి ఆవులను ఇచ్చారు. పాతిక మంది రైతులకు ఆవులను ఇచ్చాడు లారెన్స్. అలాగే మరణించిన ఒక రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చేశాడు. ఇది కచ్చితంగా అభినందించదగిన అంశమే. ఈ విషయంలో మిగతా వారూ లారెన్స్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి.

  Click Here To Read Full Article
 • టీనేజ్ లో జయలలిత అంటే పడిచచ్చే వాడట!
  Published Date : 27-Mar-2017 9:39:17 IST

  వివాదాస్పద వ్యాక్యానాలకు కేరాఫ్ అయిన జస్టిస్ మార్కేండేయ ఖట్జూ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. తన టీనేజ్ జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చాడయన. అప్పట్లో తను జయలలిత అంటే పడి చచ్చే వాడిని అని ఖట్జూ వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఆమె చాలా అందంగా ఉందని అనుకునే వాడిని అని అన్నాడు. మద్రాస్ కోర్టుకు న్యాయమూర్తిగా వెళ్లాకా ముఖ్యమంత్రి హోదాలోని జయలలితను చూశానని, అప్పుడు తన టీనేజ్ ఫీలింగ్స్ ను చెప్పడం బాగోదని ఆగిపోయానని ఖట్జూ అన్నాడు.

  Click Here To Read Full Article
 • ఇండియా క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా…!
  Published Date : 08-Mar-2017 7:38:22 IST

  ఇది వరకూ కూడా టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని సాధించింది. ఐసీసీ ప్రకటించే ర్యాంకుల జాబితాలో నంబర్ వన్ గా నిలిచింది. అయితే.. ప్రతియేటా ఏప్రిల్ ఒకటి నాటికి ర్యాకింగ్స్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న జట్టుకు ఐసీసీ అందించే భారీ ప్రైజ్ మనీని మనోళ్లు ఎప్పుడూ సాధించలేదు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వన్ మిలియన్ డాలర్లకు పెంచారు. ప్రస్తుతం టీమిండియా నంబర్ వన్ గా ఉంది. ఈ జట్టుకు ఆ మొత్తం దక్కుతుందని ఐసీసీ ట్వీట్ చేసింది.

  Click Here To Read Full Article
 • భారీ డీల్… టీమిండియాకు కొత్త స్పాన్సర్..!
  Published Date : 08-Mar-2017 7:37:23 IST

  ప్రస్తుతం క్రికెట్ టీమిండియాకు అఫిషియల్ స్పాన్సర్ గా వ్యవహరించిన స్టార్ నెట్ వర్క్ ఆ ఒప్పందాన్ని ముగించుకోవడంతో.. బీసీసీఐ నిర్వహించిన వేలంలో కొత్త స్పాన్సర్ ముందుకు వచ్చింది. భారీ డీల్ తో టీమిండియాకు అఫిషియల్ స్పాన్సర్ గా మారింది “ఒప్పో’’. ఈ మొబైల్స్ తయారీ సంస్థ ఏకంగా ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల భారీ డీల్ తో స్పాన్సర్షిప్ ను సంపాదించుకుంది. ఈ ఒప్పందం విలువ ఐదు సంవత్సరాలు. త్వరలోనే ఒప్పో టీమిండియాకు తన లోగోతో కొత్త జెర్సీలను విడుదల చేయనుంది.

  Click Here To Read Full Article
 • 2017 ఆస్కార్ విజేతలు వీరే..
  Published Date : 27-Feb-2017 7:21:35 IST

  ఉత్తమ చిత్రం: మూన్ లైట్, ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ), ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్), ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్), ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్లైట్), ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్), ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్ లైట్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: మాంచెస్టర్ బై ద సీ.

  Click Here To Read Full Article
 • వాట్సాప్ ‘స్టేటస్’ కు కొత్త ఫీచర్లు!
  Published Date : 26-Feb-2017 8:15:54 IST

  తన ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా వాట్సాప్ కొన్ని అదనపు ఫీచర్లను జోడిస్తోంది. ప్రత్యేకించి ‘స్టేటస్’ విషయంలో మార్పులు తీసుకొచ్చింది. ఇన్ని రోజులూ టెక్ట్స్, ఎమోజీలు మాత్రమే పెట్టుకోవడానికి వీలున్న ‘స్టేటస్’ లో ఇకపై వీడియోలు, జిప్ ఫైల్స్, ఫొటోలను కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా స్టేటస్ అప్ డేట్ కొత్త పుంతలు తొక్కనుంది. అలాగే.. ఇరవై నాలుగు గంటలకు ఒకసారి స్టేటస్ ఆటోమెటిక్ గా మాయం అవుతుంది, ఇంతకు ముందులా ఉండిపోదు.

  Click Here To Read Full Article
 • ఆస్ట్రేలియాకు రెండు టీమ్ లున్నట్టా!
  Published Date : 23-Feb-2017 8:36:56 IST

  తాజా సీరిస్ లో ఒకవైపు నేటి నుంచి ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. నిన్ననే ఆస్ట్రేలియా శ్రీలంకతో టీ20 సీరిస్ ను పూర్తి చేసుకుంది! ఈ విధంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టు రెండు దేశాల్లో మ్యాచ్ లను ఆడినట్టు అయ్యింది. టెస్టు ఫార్మాట్ కు, టీ20 ఫార్మాట్ కు పూర్తిగా వేర్వేరు జట్లతో బరిలోకి దిగుతోంది ఆస్ట్రేలియా. దీంతో.. ఒకే జాతికి రెండు జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టవుతోంది.

  Click Here To Read Full Article
 • సినిమాగా రాజీవ్, సోనియా లవ్ స్టోరీ!
  Published Date : 17-Feb-2017 7:00:25 IST

  దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీల ప్రేమకథను ఒక షార్ట్ ఫిల్మ్ గా తీస్తున్నాడొక యువ సినీ రూపకర్త. ఇందులో కరణ్వీర్ బోరా రాజీవ్ గాంధీగా, ప్రియా బెనర్జీ సోనియా గాంధీగా నటించబోతున్నారు. ఈ లఘుచిత్రానికి ‘ఇజాజత్ టైటిల్ను ఖరారు చేశారు. సోనియా, రాజీవ్ల ప్రేమకథ కేవలం ఓ ప్రేమకథగానే రాబోతోందని ఇందులో ఎలాంటి రాజకీయ విషయాలు ప్రస్తావించడంలేదని కరణ్ అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించడంతో ఇందులో నటించడానికి ఒప్పుకున్నానన్నాడు. మరి ఈ స్టోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందేమో!

  Click Here To Read Full Article
 • టెండూల్కర్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు!
  Published Date : 14-Feb-2017 9:44:24 IST

  సచిన్ టెండూల్కర్ బయోపిక్ ‘సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఈ ఏడాది మే ఇరవై ఆరో తేదీన ఈ సినిమా విడుదల కానుందని టెండూల్కర్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా వచ్చిన పలు సినిమాలు విజయవంతం అయ్యాయి. అజహర్, ధోనీల జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలొచ్చాయి. ఈ నేపథ్యంలో టెండూల్కర్ బయోపిక్ కు మంచి ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Click Here To Read Full Article
 • ‘మా టీవీ’ లోగోను మార్చేస్తున్నారు!
  Published Date : 13-Feb-2017 12:14:07 IST

  నేటి రాత్రి తొమ్మిదిన్నరకు ‘మా టీవీ’ లోగోను మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ లోగో స్థానే ‘స్టార్’ మార్క్ తో కూడిన లోగోను వాడనున్నారు. ఈ లోగోను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఇది వరకూ కూడా కొన్నేళ్ల కిందట ఈ టీవీ చానల్ లోగో మారింది. పాత లోగోను వదిలించుకుని పదేళ్ల కిందట ప్రస్తుత లోగోనుతెచ్చారు. ఆ తర్వాత ఇటీవల స్టార్ నెట్ వర్క్ మా లో వాటాలను కొన్నది. దీంతో ఇప్పుడు లోగో రూపు మారుతోంది!

  Click Here To Read Full Article
 • తండ్రి కాబోతున్న మరో యువహీరో!
  Published Date : 31-Jan-2017 8:46:53 IST

  మరో నాలుగు నెలల్లో తను తండ్రిని కాబోతున్నాను అని తెలిపాడు హీరో నాని. తండ్రులవుతున్న యువ హీరోల జాబితాలో తను కూడా ఉన్నానని ధ్రువీకరించాడు. తను ఇంకా చిన్న పిల్లాడినే అని, తండ్రి పాత్రలో తనను తాను ఊహించుకోలేకపోతున్నాను అని.. ఈ హీరో చమత్కరించాడు. ప్రస్తుతం ‘నేను లోకల్’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇందులో తను స్టూడెంట్ గా నటిస్తున్నాను అని తెలిపాడు. నిజజీవితంలో పెద్దగా చదువుకోలేదని, సినిమా లేకపోతే తను జీరో అని నాని అన్నాడు.

  Click Here To Read Full Article
 • వెంకీతో ఆగింది, రామ్ తో పట్టాలెక్కుతోంది!
  Published Date : 30-Jan-2017 10:32:33 IST

  ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ సినిమా ఎంతకూ పట్టాలెక్కపోవడంతో రామ్ తో సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట దర్శకుడు కిషోర్ తిరుమల. ‘నేను శైలజ’ సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు వెంకీతో సినిమా చేయడం గురించి చాన్నాళ్ల నుంచే సమాలోచనలు జరుపుతున్నాడు. అయితే ఈ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తన గత చిత్ర హీరో రామ్ తో ఒక సినిమాను ప్రతిపాదన దశలోకి తీసుకొచ్చాడట కిషోర్ తిరుమల. రామ్ కూడా ఈ దర్శకుడితో సినిమాపై ఆసక్తితోనే ఉన్నాడు.

  Click Here To Read Full Article