• కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థి ఆయనే!

    Published Date : 11-Jan-2018 5:55:18 IST

    కర్నూలు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించాడు. అయితే ఆయన ఫిరాయింపుకు పాల్పడి తెలుగుదేశం వైపు వెళ్లడంతో అక్కడ మరో అభ్యర్థిని ఎంచుకుంది ఆ పార్టీ. ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ తమ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రతి జిల్లాకూ ఒక నియోజకవర్గాన్ని ముస్లింలకు కేటాయించాలని వైకాపా అధినేత స్వీయనిమయం పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా ఈ సీటును హఫీజ్ కు కేటాయించినట్టుగా తెలుస్తోంది.

Related Post