• వైఎస్సార్ కుటుంబం.. సభ్యుల సంఖ్య ఎంతంటే..

    Published Date : 23-Sep-2017 9:48:06 IST

    ‘వైఎస్సార్‌ కుటుంబం’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటి వరకూ… 11 రోజుల్లో 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరారని తెలిపింది. సెప్టెంబర్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్‌ 2వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించింది. దీనిపై ఈనెల 24న మధ్యంతర సమీక్ష నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపింది. లండన్‌ నుంచి తిరిగొచ్చిన ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ నాయకులు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

Related Post