• వైఎస్ కు ఘన నివాళి…

    Published Date : 02-Sep-2017 4:31:31 IST

    ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఏపీ, తెలంగాణల వ్యాప్తంగా వైఎస్ కు నివాళి అర్పించాయి. వైఎస్ విగ్రహాలకు పూల మాలలు వేసి.. అంజలి ఘటించారు వైకాపా కార్యకర్తలు, వైఎస్ అభిమానులు. వైఎస్ కుటుంబీకులు ఇడుపుల పాయలోని వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జగన్, షర్మిల, భారతి, అవినాష్ రెడ్డి.. వైఎస్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.

Related Post