• ఉత్త మాటలేనా?… చేతలుంటాయా?

    Published Date : 31-Dec-2017 12:15:26 IST

    చాలామంది నాయకులు ‘నేను లేస్తే మనిషిని కాను’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కాని లేవరు. లేస్తే ఏం కొంపలు ముంచుతాడోనని జనం అనుకుంటారుగాని చివరాఖరుకు ఏమీ ఉండదు. తెలంగాణ కాంగ్రెసు నాయకుడు మధు యాష్కీ కూడా ఇదే టైపు నాయకుడా? ఇంతకూ ఈయనేమంటున్నాడు? మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత అవినీతికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

    గత ఎన్నికల్లో వారి ఆస్తులు ఎంత ఉన్నాయో, ఇప్పుడు ఎంతమేరకు పెరిగాయో లెక్కలు ఉన్నాయట. కేటీఆర్‌ ఓ టూ వీలర్‌ తయారీ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని అడ్డంగా దొరికిపోయారట. ఆ చరిత్ర త్వరలోనే బయటపెడతాడట. కేసీఆర్‌ ఫ్యామిలీ అవినీతి గురించి చాలామంది నాయకులు మాట్లాడినా ఇప్పటివరకు ఏం బయటపెట్టలేదు. యాష్కీ ఆధారాలూ ఉడుత బెదిరింపులేనేమో…!

Related Post