• యూపీ కొత్త సీఎం ఆయనే..!

    Published Date : 18-Mar-2017 8:59:28 IST

    ఉత్తరప్రదేశ్లో అధికారాన్నిచేజిక్కించుకున్న బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పేరును ఖరారు చేసింది. మొత్తం 403 సీట్లలో 324 స్థానాలు బీజేపీ, దాని మిత్రపక్షాలైన చిన్న పార్టీలకు దక్కాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి మాత్రం కాస్త ఆలస్యమైంది. గత శనివారమే ఎన్నికల ఫలితాలు వెలువడగా వారం రోజుల తర్వాత మళ్లీ శనివారం రోజున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రస్తుత ఉత్తరాఖండ్లో జన్మించిన యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్. ఈయన ఇప్పటికి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు.

Related Post