• హిల్లరీనే మళ్లీ పోటీ చేయాలి.. గెలుపు ఈజీ!

    Published Date : 17-Oct-2017 10:27:13 IST

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి హిల్లరీ క్లింటన్ తోనే పోటీ పడాలని ఉందని వ్యాఖ్యానించాడు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆమెతో మరోసారి తలపడాలని ఉందని, అలా అయితే తన గెలుపు సులభం అవుతుందని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. గత ఎన్నికల్లో హిల్లరీపై ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ గెలవలేడు అని అనేక మంది అనుకున్నా అనూహ్య విజయం సాధించాడాయన. ఇప్పుడు కూడా ట్రంప్, హిల్లరీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్ నురేపిస్టుగా అభిప్రాయపడింది హిల్లరీ, ఆమె బలహీనమైన అభ్యర్థి అని ట్రంప్ ఎద్దేవా చేశాడు.

Related Post