• రాజీనామా.. కేసీఆర్ చెప్పినప్పుడు..!

    Published Date : 23-Sep-2017 9:52:02 IST

    నల్లగొండ ఎంపీ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేయనున్నాడనేది గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. మరి ఈ అంశంపై తాజాగా సుఖేందర్ రెడ్డి స్పందించాడు. తన రాజీనామా అంశం తన చేతిలో ఏమీ లేదని ఆయన చెప్పాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పుడు తను రాజీనామా చేస్తాను అని.. ఆయన ప్రకటించాడు. ఇందులో రెండో ఆలోచన ఏమీ లేదని ఆయన స్పష్టం చేశాడు. ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడే తన రాజీనామా అని సుఖేందర్ రెడ్డి తేల్చి చెప్పాడు.

Related Post