• ఏకగ్రీవంగా నెగ్గిన తెలుగుదేశం!

    Published Date : 29-Dec-2017 4:54:19 IST

    ముగ్గురు ఇండిపెండెంట్లు పోటీ చేసినప్పటికీ.. వాళ్ల నామినేషన్లు చెల్లకపోవడంతో కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో వచ్చిన ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేసినా.. అవి చెల్లుబాటు కాలేదు. దీంతో తెలుగుదేశం అభ్యర్థి కేఈ ప్రభాకర్ కు లైన్ క్లియర్ అయ్యింది. విజయం టీడీపీ సొంతం అయ్యింది.

Related Post