• ఆర్థికంగా దెబ్బతీశారు, టీడీపీకి రాజీనామా!

    Published Date : 04-Aug-2017 3:51:17 IST

    గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు.గిద్దలూరులో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయ్యి రాజీనామా విషయాన్ని ప్రకటించారాయన. కార్యకర్తల సమావేశంలోనే ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, తన మెడలోనుంచి పార్టీ కండువాను పక్కన పడేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ టీడీపీలో నన్ను తీవ్రంగా అవమానించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా టీడీపీలో కొనసాగితే తనకు సిగ్గు లేనట్టేనని అన్నారు. ఆ కారణంగానే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Related Post