• లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశం!

    Published Date : 28-Dec-2017 6:26:36 IST

    ముస్లిం విడాకుల చట్టంలోని ట్రిపుల్ తలాక్ విధానానికి స్వస్తి పలకాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలను వేగిరం చేసింది. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై కోర్టులో తమ వ్యతిరేకతను చాటుకున్న కేంద్రం, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ను చట్టపరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్ సభలో బిల్లును కూడా ప్రవేశపెట్టింది కేంద్రం. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెడుతూ.. తలాక్ విధానానికి ముస్లిం దేశాలే స్వస్తి చెప్పినట్టు.. మన దేశంలో అదెందుకు ఉండాలని ప్రశ్నించారు.

Related Post