• సుబ్బూ స్వామీ… కాని పనుల గురించి ఎందుకయ్యా…?

    Published Date : 31-Dec-2017 12:18:46 IST

    రాజకీయ నాయకుల నోరు ఊరుకోదు. తిమ్మిరిగా ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి వాగుతుంటారు. ఆ మాటలవల్ల ప్రయోజనం శూన్యం. ఈ స్టేట్‌మెంట్లను పట్టుకొని మీడియా, పార్టీలు రచ్చ చేస్తుంటాయి. సుబ్బూ స్వామి అంటే డాక్టర్‌ సుబ్రమణ్యస్వామికి ఎలాంటి పదవీ లేకపోవడంతో ఏం తోచక ఏదో ఒక ప్రకటన చేస్తుంటారు. బీజేపీ నాయకులు ఆధునిక దుస్తులు ధరించడం నిషేధించాలట.

    మన సంప్రదాయాలకు అనుగుణంగా భారతీయ దుస్తులే వేసుకోవాలట. ఇందుకోసం పార్టీ నిబంధనలు సవరించాలని స్వామి సలహా ఇచ్చారు. ఈ విషయం ముందుగా ప్రధాని మోదీకి చెబితే బాగుంటుంది కదా. ఖరీదైన దుస్తులు ధరించే కాషాయ నేతల్లో ఆయనే మొదటోడు. మద్యం నిషేధించాలని కూడా ఈయనగారు కోరారు. అది అయ్యే పనేనా? కాని పనుల గురించి మాట్లాడటం ఎందుకు?

Related Post