• రాష్ట్రపతి అభ్యర్థిగా కొత్త పేరును తెరపైకి, బీజేపీ నో!

    Published Date : 19-Jun-2017 2:43:08 IST

    రాష్ట్రపతి అభ్యర్థిగా అనేక మంది పేర్లను ప్రతిపాదిస్తున్న శివసేన ఇప్పుడు మరో పేరును తెరపైకి తెచ్చింది. వీహెచ్పీ నేత ఒకరు , శరద్ పవార్.. వంటి పేర్లను ప్రతిపాదించింది శివసేన అయితే ఆ ప్రతిపాదన పట్ల కమలం పార్టీ సానుకూలంగా స్పందించలేదు. ఈ క్రమంలో శివసేన కొత్త పేరును తెరపైకి తెచ్చింది. శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్ రాష్ట్రపతిగా చేద్దామని కమలం పార్టీ ముందు ప్రతిపాదన పెట్టింది శివసేన. అయితే బీజేపీ మాత్రం అభ్యంతరం చెబుతోంది.రాజకీయేతర వ్యక్తిని రాష్ట్రపతిగా చేయడానికి కమలం సానుకూలంగా లేదు.

Related Post