• క్రికెటర్ కు క్యాబినెట్ ర్యాంక్.. మరి పదవి?
    Published Date : 16-Mar-2017 7:07:05 IST

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు పదవి దక్కడం అయితే ఖాయం అయ్యింది. కేబినెట్ ర్యాంకు కూడా దక్కనుంది. మరి ఆయనకు ఉపముఖ్యమంత్రి అనే హోదాను ఇస్తారా ఇవ్వరా అనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్ లో కొత్త ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం చేయనున్నాడు. ఆయనతో పాటు సిద్ధూ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. మరి సిద్ధూకు దక్కే హోదా ఏమిటనేదే ప్రశ్న.