• పార్టీకి రాజీనామా చేస్తున్నందుకు బాధే..!

    Published Date : 12-Oct-2017 9:13:29 IST

    ఇటీవలే తను టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన ముకుల్ రాయ్… ఆ అంశం మీద మరోసారి స్పందించాడు. తను రాజ్యసభ సభ్యత్వానికి, టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా ప్రకటించాడీయన. ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని వైస్ ప్రెసిడెంట్‌కు పంపించానని పేర్కొన్నాడు. టీఎంసీని వీడటం బాధాకరమే అని ఈయన చెప్పుకొచ్చాడు. తను బీజేపీ నేతలతో సౌకర్యవంతంగా ఉంటానని అన్నాడు. ఈయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలున్నాయి. బహుశా అదే జరిగేలా ఉంది.

Related Post