• చంద్రబాబు శిఖండిలా మాట్లాడుతున్నారు!
    Published Date : 04-Aug-2017 3:53:09 IST

    తెలుగుదేశం నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. సీఎంపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేని స్పష్టం చేసిన ఆమె.. ఇదే సమయంలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైఎస్‌ జగన్‌ను తిట్టడానికే సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేసిన తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడాలన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబే శిఖండిలా మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు.