• మోడీ కేబినెట్ లోకి రెడ్డి..?

    Published Date : 02-Sep-2017 4:33:20 IST

    కేవలం ఎంపీ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే కేంద్రంలో మంత్రి పదవులను ఇవ్వాలని ఏమీ లేదు కదా.. దీంతో ఆ హోదాలు లేని వారికి కూడా పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ లో సలహాదారుగా ఉన్న వెదిరే శ్రీరామ్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కనుందనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ నుంచి ఈయనకు ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందని సమాచారం. విదేశాల్లో పని చేసిన అనుభవం ఉన్న ఆయన మూడేళ్ల కిందట ఇండియా వచ్చి బీజేపీలో చేరాడు. మరి ఈ ఊహాగానాలు ఎంత వరకూ నిజమవుతాయో చూడాలి.

Related Post