• పన్నీరు సెల్వానికి పళనిసామి ఆఫర్ అదే!

    Published Date : 18-May-2017 9:16:21 IST

    రాజీ పడతాయని అనిపించిన పన్నీరు, పళని సామి వర్గాలు ఆ సూచనలేమీ లేకుండా సాగుతున్నాయి. రాజీ పడ్డట్టుగా అనిపించి.. ఆ వెంటనే మళ్లీ ఇరు వర్గాలు విమర్శలు సంధించుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో పన్నీరు మాట్లాడుతూ.. తనకు పళనిసామి వర్గం నుంచి మంత్రి పదవి ఆఫర్ వచ్చిందని, ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలను ఇస్తామని చెప్పారని అన్నారు. అయితే తను జయలలిత దగ్గరే ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశానని..పళని సామి ఎంత అన్నట్టుగా పన్నీరు వ్యాఖ్యానించారు. మరి పన్నీరు టార్గెట్ సీఎం పోస్టేనేమో!

Related Post