• సినిమా హీరోలపై పొలిటీషియన్ సెటైర్లు!

    Published Date : 06-Aug-2017 12:47:08 IST

    రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్న సినిమా హీరోలపై సెటైర్లు వేశాడు తమిళనాడు సీఎం పళని స్వామి. ఎవరి పేరూ డైరెక్టుగా చెప్పకపోయినా.. తమిళనాట రాజకీయ ప్రకటనలతో వేడెక్కిస్తున్న రజనీకాంత్, కమల్ హాసన్ లను ఉద్దేశించి పళని వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నాడు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ముందుగా ప్రజలకు సేవ చేయాలని పళని అన్నాడు. సినీ నటులు రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనసులు గెలుచుకోకుండా ఎవరూ అందలం ఎక్కలేరని వ్యాఖ్యానించారు.

Related Post