• ఓటమి ఓటమికే దారితీస్తుందా?

    Published Date : 01-Jan-2018 10:15:26 IST

    ఓడిపోతే కుంగిపోకూడదని, ఓటమి విజయానికి సోపానమని వ్యక్తిత్వ వికాస నిపుణలు నిరాశవాదులను ఉత్తేజపరుస్తుంటారు. కాని రాజకీయాల్లో వ్యక్తిత్వ వికాస పాఠాలు మరోలా ఉంటాయి. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణలో కొత్త నిబంధనలు పెట్టారు. దీంతో కొందరు నాయకుల రాజకీయ భవిష్యత్తు మాటాషయ్యే ప్రమాదముంది.

    ఏంటా నిబంధన? వరుసగా ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన లీడర్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు హుళక్కే. మరో నిబంధన ఏమిటంటే..గత ఎన్నికల్లో 15వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయినవారికి కూడా టిక్కెట్లు బందు పెడతారు. ఓడిపోయిన వారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని, కాబట్టి పక్కన పెట్టడమే మంచిదని సూత్రీకరించారు రాహుల్‌ గాంధీ. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే చాలామందికి విషాద యోగమే…!

Related Post