• ఒక్కడు పోతే పార్టీ మునుగుతుందా?

    Published Date : 31-Dec-2017 12:12:47 IST

    ఏదైనా పార్టీ నుంచి ఓ నాయకుడు జంప్‌ జిలానీ కాగానే అతను వెళ్లిపోయినా ఏం నష్టంలేదని, కార్యకర్తలు తమ వెంటనే ఉన్నారని నేతలు స్టేట్‌మెంట్‌ ఇస్తుంటారు. రేవంత్‌ రెడ్డి ఫిరాయించినప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు ఇలాంటి స్టేట్‌మెంట్లే ఇచ్చారు. పోయిందే మంచిదన్నట్లు మాట్లాడారు. కాని సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ‘రేవంత్‌ పార్టీని ముంచిపోయాడు’ అన్నారు ఈమధ్య.

    రేవంత్‌ వెళ్లిపోయాక తెలంగాణలో టీడీపీ లేదనే భావన ఏర్పడిందన్నారు. ఆయనది క్రిమినల్‌ మెంటాలిటీ అని దుమ్మెత్తిపోశారు. రేవంత్‌ రెడ్డి పోగానే పార్టీ మునిగిందనే భావన జనాలకే కాదు, పార్టీలోని నాయకులకూ వచ్చిందన్నమాట. ఆయనంత దూకుడుగా, హుషారుగా మిగిలినవారు లేనందువల్లనే పార్టీ మునిగిందనుకుంటున్నారు. ఇది ఆయన తప్పు కాదు కదా…!

Related Post