• ఇక నంద్యాల పోరు మరింత రసవత్తరం!

    Published Date : 15-Jul-2017 6:27:24 IST

    భూమా నాగిరెడ్డి మరణించి ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయాయి. మరోవైపు నంద్యాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం లు రంగంలోకి దిగి ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. మరి ఇంతకీ నోటిఫికేషన్ ఎప్పుడు.. అంటే, ఈ నెలాఖరు కళ్లా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ రావొచ్చని పేర్కొన్నారు. మరి నోటిఫికేషన్ వస్తే నంద్యాల పోరు మరింత రసవత్తరంగా మారుతుంది.

Related Post