• కేజ్రీవాల్ కు మరోసారి కోర్టు జరిమానా..

    Published Date : 04-Sep-2017 4:49:29 IST

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర హై కోర్టు ఐదు వేల రూపాయల ఫైన్ విధించింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కానందుకు, వివరణ ఇవ్వనందుకు కోర్టు ఈ జరిమానా విధించింది. ఇది వరకూ ఇదే కేసులో కోర్టు కేజ్రీకి పదివేల రూపాయల జరిమానా విధించింది. మొత్తం పదికోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు జైట్లీ. ఢిల్లీ క్రికెట్ బోర్డులో అవినీతి జరిగిందనే కేజ్రీ ఆరోపణలపై ఈ పిటిషన్ వేశారు.

Related Post