• చైనాతో వార్.. ఇండియాకు జపాన్ మద్దతు!

    Published Date : 18-Aug-2017 3:22:42 IST

    ఇండో, చైనాలు సరిహద్దు సమస్యను శాంతీయుతంగా పరిష్కరించుకోవాలని సూచిస్తూనే, ఒకవేళ యుద్ధమంటూ వస్తే తాము భారత్ పక్షానే అని ప్రకటించింది జపాన్. అయితే సైనిక చర్య పట్ల తొందరపాటు వద్దని జపాన్ సూచించింది. ఈ మేరకు ఆ దేశ దౌత్యాధికారి ఒక ప్రకటన చేశారు. గత కొన్ని నెలలుగా డొక్లామ్ విషయంలో చైనా తీరు వివాదాస్పందంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో సైనిక చర్యకు ఇరు దేశాలూ సై అంటున్నారు. రెండుదేశాలూ వెనక్కు తగ్గేలా లేవు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రకటన ఆసక్తికరంగా మారింది.

Related Post