• ఇంట్రస్టింగ్: ఫిరాయింపు మంత్రులపై కోర్టులో పిల్!
    Published Date : 11-Jul-2017 9:00:07 IST

    ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి.. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు తీసుకున్న నలుగురు ఎమ్మెల్యేలను మంత్రి పదవుల నుంచి తక్షణం తొలగించాలని కోరుతూ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. రాజ్యాంగం ప్రకారం అలాంటి ఫిరాయింపులు చెల్లవని, అలా మంత్రి పదవులు పొందే అర్హత ఉండదని.. కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు. ఇప్పటికే ఫిరాయింపుల అంశం కోర్టు వరకూ వెళ్లింది. అయితే ఫిరాయింపుదార్లు హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పిల్ వారి రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేయగలేదేమో చూడాలి.