• గుర్మీత్ ఆస్తుల విలువ.. వందలు కాదు, వేల కోట్లలో!

    Published Date : 27-Sep-2017 10:36:14 IST

    అత్యాచారం కేసులో శిక్షను ఎదుర్కొంటున్న డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆస్తుల విలువ సుమారు రూ.1,600 కోట్లు అని హర్యానా ప్రభుత్వం తేల్చింది. ఈ మేరకు గుర్మీత్ వ్యవహారాలపై విచారణ సాగిస్తున్న హై కోర్టుకు ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఈ భారీ ఆస్తుల నంబర్ నేపథ్యంలో.. వీటిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులన్నీ హర్యానా పరిధిలోనివే, బయట మరిన్ని ఉన్నాయని ప్రభుత్వం పేర్కొందని సమాచారం.

Related Post