• డీఎంకేలో లుకలుకలు, స్టాలిన్‌పై మండిపాటు!

    Published Date : 28-Dec-2017 6:24:51 IST

    తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో లుకలుకలు స్పష్టం అవుతున్నాయి. 2జీ కేసులో కనిమొళి, రాజాలకు రిలీఫ్ దొరికిన అనంతరం కాస్త కుదుటపడుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ పార్టీలో అన్నదమ్ముల పోరు మళ్లీ రాజుకుంటోంది. స్టాలిన్ నాయకత్వాన్ని సమర్థించని అళగిరి మరోసారి విరుచుకుపడ్డాడు. ఆర్కే నగర్ లో పార్టీ చిత్తయిపోవడానికి కారణం స్టాలిన్ నాయకత్వం అని అంటున్నాడు అళగిరి. ఈ అన్నదమ్ముల మధ్య సుదీర్ఘకాలం నుంచినే విబేధాలున్నాయి. ఇప్పుడు మళ్లీ అవి పెద్దవైనట్టుగా ఉన్నాయ్.

Related Post