• కమల్‌పై దుమ్మెత్తి పోసిన స్టాలిన్!

    Published Date : 27-Sep-2017 10:37:58 IST

    నటుడు కమల్ హాసన్ పై దుమ్మెత్తి పోశాడు డీఎంకే నేత స్టాలిన్. మొన్నటి వరకూ కమల్ తో స్టాలిన్ కు సన్నిహిత సంబంధాలే ఉండేవి. అయితే డీఎంకే కూడా అవినీతి మయమైన పార్టీ అని కమల్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో స్టాలిన్ విరుచుకుపడ్డాడు. కమల్ కు పిచ్చి పట్టిందని అన్నాడు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు అని.. కానీ పిచ్చి వాళ్లు మాత్రం రాకూడదని, కమల్ అలాంటి పిచ్చివాడు అని.. స్టాలిన్ వ్యాఖ్యానించాడు. ఒకసారి ఖాకీ అని మరోసారి కాషాయం అని కమల్ పొంతన లేకుండా మాట్లాడుతున్నాడని ఈ పొలిటీషియన్ అన్నాడు.

Related Post