• బాబూ… నేలమాళిగల్లో డబ్బు దాచుకుంటారా?

    Published Date : 01-Jan-2018 10:16:58 IST

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలోకెల్లా సీనియర్‌ నేత అయినప్పటికీ కొన్నిసార్లు మీనింగ్‌లెస్‌గా మాట్లాడుతుంటారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ పథకాలకు బ్యాంకులు సహకరించడంలేదంటూ బాగా కోపగించుకున్నారు. ఇలాగే సహకరించకుండా ఉంటే తానెలా ప్రతీకారం తీర్చుకుంటారో వారికి చెప్పారు. ఏం చేస్తారు? బ్యాంకులు మూసేస్తారా? ఆ పని చేసే అధికారం ఈయనకు లేదు కదా.

    అందుకని బ్యాంకుల్లో ఉన్న కోట్లాది రూపాయల డిపాజిట్లు తీసేసుకుంటారట. ఈ పని చేసేది తానొక్కడే కాదట. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని ప్రజలకు కూడా చెబుతారట. ఇదీ సీనియర్‌ నేత అనుభవం. ఇవి అనుభవజ్ఞుడు మాట్లాడే మాటాలా? అమాయకుడు మాట్లాడే మాటలా? ప్రభుత్వ డిపాజిట్లు తీసుకొని నేలమాళిగల్లో దాచుకుంటారా? గోతులు తీసి పూడ్చిపెడతారా? ఇప్పటికే పాలకులు బ్యాంకులను దివాలా తీయించారు. ఇంకా నాశనం చేస్తారా?

Related Post