• బీజేపీ జాగ్రత్త పడుతోంది..!

    Published Date : 15-May-2017 9:57:57 IST

    రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే ఎన్డీయేతర పక్షాల మద్దతును సంపాదించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసిన బీజేపీ.. ఇదే సమయంలో సొంత ఓట్ల విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తోంది. గోవా సీఎంగా వెళ్లిన పారికర్, యూపీ సీఎం గా వెళ్లిన యోగి ఆదిత్యనాథ్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య… వీళ్లంతా ఎంపీలుగానే ఉన్నారింకా. రాష్ట్రపతి ఎన్నికలయ్యేంత వరకూ వారిని ఆ హోదాలోనే ఉంచి, వారి ఓట్లను పొందాలని బీజేపీ భావిస్తోందని సమాచారం.

Related Post