• బీజేపీ.. దేశంలోనే ధనిక పార్టీ!

    Published Date : 17-Oct-2017 10:25:40 IST

    అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌, ఎలక్షన్‌ వాచ్‌ ‌లు దేశీయ రాజకీయ పార్టీల ఆస్తుల వివరాలను వెల్లడించాయి. ఈ లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా నిలిచింది. 868 కోట్ల రూపాయలతో బీజేపీ వెల్తీ పార్టీగా నిలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 758 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంది. బీఎస్పీ 557 కోట్ల రూపాయలతో ఉంది. సీబీఎం 432 కోట్ల రూపాయల ఆస్తులతో తదుపరి స్థానంలో ఉంది. టీఎంసీ ఆస్తుల విలువ దాదాపు 45 కోట్ల రూపాయలు.

Related Post