• బాలయ్య రాజకీయ అజ్ఞానం..!

    Published Date : 16-Aug-2017 7:48:33 IST

    నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి దిగిన నందమూరి నటసింహంపై విమర్శల వాన కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై అనేక మంది సెటైర్లు వేస్తున్నారు. దీనికంతటికీ కారణం శిల్పా సోదరులను బాలయ్య విమర్శించిన తీరే. తెలుగుదేశం ద్వారా తమకు సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి వారు వెళ్లిపోయారు. అయితే వైకాపా తరపున నెగ్గిన వారి చేత చంద్రబాబు రాజీనామా చేయించలేదు. అయినా వైకాపాలోకి వెళ్లిన వారిని విమర్శిస్తున్న బాలయ్యది రాజకీయ అజ్ఞానం అని నెటిజన్లు అంటున్నారు.

Related Post