• బాబుకు అహంకారం పెరిగింది!

    Published Date : 01-Sep-2017 7:30:07 IST

    తెలుగుదేశం పార్టీనే శాశ్వతంగా అధికారంలో ఉంటుందని అనడం.. చంద్రబాబు అహంకారానికి నిదర్శనం అని వ్యాఖ్యానించాడు వైకాపా నేత అంబటి రాంబాబు. నంద్యాల్లో, కాకినాడల్లో తెలుగుదేశం విజయం కేవలం తాత్కాలికమే అని అంబటి అన్నాడు. పోల్ మెనేజ్ మెంట్, పొలిటికల్ మేనేజ్ మెంట్లతోనే తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించిందని అన్నారు. వీటితో వైకాపా వెనక్కు తగ్గదని.. దీక్షగా పని చేసి.. ప్రజా ఉద్యమాలతో చంద్రబాబును పడగొడుతుందని అంబటి వ్యాఖ్యానించాడు.

Related Post