• పంజాబ్ సీఎం ఆసక్తికర నిర్ణయం

    Published Date : 18-Mar-2017 8:55:09 IST

    పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ.. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అందరి కార్లకూ బుగ్గలు తీసేస్తామని ప్రకటించారు. అమరీందర్ మంత్రివర్గం ఇంకా అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పంజాబ్నుంచి డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా తరిమేయడానికి వీలుగా ఒక స్పెషల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు.

Related Post