• వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మరణం

    Published Date : 30-Sep-2017 8:52:53 IST

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గం నేత కొల్లం బ్రహ్మానంద రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణం చేత ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన రైల్వే కోడూరులో నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండినారు బ్రహ్మానందరెడ్డి. ఎమ్మెల్యే కానప్పటికీ నియోజకవర్గంలో క్రియాశీలంగా వ్యవహరించారీయన. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేశారు. బ్రహ్మానందరెడ్డి మరణంపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related Post