• అబ్బే సోనియా పూర్తిగా తప్పుకోలేదు.. కొంచెమే!
  Published Date : 15-Dec-2017 4:34:59IST

  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారన్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. సోనియా అధ్యక్ష బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నారని రాజకీయాల నుంచి కాదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాహుల్‌‌కు అధ్యక్ష బాధ్యతలను అప్పగించినా పార్టీలో ఆమె పాత్ర కొనసాగుతుందని చెబుతున్నారు. ఆమె ఏఐసీసీ బాధ్యతల నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు. రాజకీయాల నుంచి కాదని,, ఆమె ఆశీస్సులు, సూచనలు పార్టీ ఉంటాయని తెలిపారు.

  Read More
 • మోడీకి పాకిస్తాన్ జవాబు
  Published Date : 11-Dec-2017 1:03:52IST

  ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ బదులు ఇచ్చింది. భారత్ లో జరిగే ఎన్నికల లోకి తమను ఎదుకు లాగుతారని ప్రశ్నించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అదికార ప్రతినిది మాట్లాడుతూ బారత ఎన్నికల చర్చలోకి తమను లాగవద్దని వ్యాఖ్యానించారు. ‘భారత్‌ తన సొంత ఎన్నికల చర్చలోకి పాకిస్థాన్‌ను లాగడం మానుకోవాలి. కల్పితమైన కుట్ర ఆరోపణలకు బదులు సొంత బలంతో ఎన్నికలను గెలిచే ప్రయత్నం చేయాలి. ఈ కుట్ర కథనాలు ఆధారరహితం, బాధ్యతారాహిత్యం అని ఆయన వ్యాఖ్యానించారు.

  Read More
 • బీజేపీపై విరుచుకుపడ్డ నటుడు!
  Published Date : 08-Dec-2017 6:26:32IST

  బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు నటుడు ప్రకశాష్ రాజ్. హిందుత్వం, జాతీయ భావం ఒకటే అన్న ఆ ఎంపీ వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ ఖండించాడు. ఆ రెండూ ఒకటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుకు? అంబేద్కర్‌, అబ్దుల్‌ కలాం, రెహమాన్‌, కుష్వంత్‌ సింగ్‌, అమృత ప్రీతమ్‌, డాక్టర్‌ కురియన్‌ వీరంతా ఎవరు?. నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? పునర్జన్మలను నమ్మే మీరు హిట్లర్ వారసులా? అని ప్రశ్నించాడు.

  Read More

 • Widget not in any sidebars
 • ఆర్కే నగర్.. విశాల్ మద్దతు ఎవరికంటే!
  Published Date : 07-Dec-2017 3:39:07IST

  ఆర్కే నగర్ బై పోల్ లో పోటి చేయడానికి తను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఈసీ తిరస్కరించడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు విశాల్. అయితే ఇంతటితో తను తగ్గేది లేదని విశాల్ ప్రకటించారు. తను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలుకుతానని విశాల్ ప్రకటించాడు. అయితే ఆ స్వతంత్ర అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈ హీరో ఇంకా ప్రకటించలేదు. యువకుడు అయిన ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలికి గెలిపించుకుంటాను అని విశాల్ ప్రకటించాడు. మరి విశాల్ ఎవరికి మద్దతునిస్తాడో చూడాలి.

  Read More
 • బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేసింది
  Published Date : 03-Dec-2017 10:27:05IST

  యూపీ స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభజంనానికి కారణం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే అని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్. ఏ గుర్తుకు ఓటేసినా కమలానికే పడేలా ఈవీఎంలను సెట్ చేవారని.. అందుకే యూపీలో బీజేపీ విజయం సాధ్యం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ లో కాంగ్రెస్ విజయం తథ్యమని ఫెర్నాండేజ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలవడానికి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఈ కాంగ్రెస్ నేత ఈ విధంగా స్పందించారు.

  Read More
 • మోడీపై విరుచుకుపడ్డ మన్మోహన్!
  Published Date : 03-Dec-2017 10:25:47IST

  గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఓట్లు అడిగే పద్ధతే బాగోలేదని మన్మోహన్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవటంలో విఫలమైన మోదీ ప్రజల్లోకి ఎలా వెళతారన్నారు. ఓట్లడిగేటప్పుడు గౌరవప్రదమైన విధానాన్ని ఎంచుకోవాలన్నారు. నోట్ల రద్దును అకస్మాత్తుగా, సన్నద్ధం కాకుండానే చేసిన యుద్ధంగా అభివర్ణించారు. నల్లధనం వెలికితీసేందుకు చేపట్టిన నోట్లరద్దుతో ప్రభుత్వం సామాన్యుడిని కూడా దొంగలా చూస్తోందన్నారు.

  Read More

 • Widget not in any sidebars
 • ఏపీ మాజీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితి విషమం
  Published Date : 06-Nov-2017 8:34:22IST

  యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఒకప్పటి కాంగ్రెస్ నేత ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ(91) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో తివారీ చికిత్స పొందుతున్నారు. తీవ్ర జ్వరం, నిమోనియాతో తివారీ ఆసుపత్రి పాలయ్యారు. వయసు రీత్యా ఆయన వీటితో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉండి చికిత్సను పొందుతున్నట్టు సమాచారం. కొన్నాళ్ల కిందట తివారీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.

  Read More
 • జగన్ పాదయాత్ర తొలి రోజు అప్‌డేట్స్
  Published Date : 06-Nov-2017 8:28:25IST

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పం పాదయాత్ర తొలి రోజున 8.9 కిలోమీటర్ల పొడవున సాగింది. ఇడుపుల పాయ నుంచి మొదలైన ఈ యాత్రం వేంపల్లిని చేరుకుంది. ఉదయం 9.47కి జగన్ పాదయాత్ర మొదలైంది. మారుతీనగర్, వీరన్న గట్టు పల్లె ల మీదుగా వేంపల్లి వరకూ జగన్ యాత్ర సాగింది. వీరన్నగట్టుపల్లెవద్ద జగన్ తమ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏర్పాటు చేసిన టెంటులో జగన్ రాత్రికి బస చేస్తున్నారు. రెండో రోజు వేంపల్లె నుంచి యాత్ర సాగుతుంది.

  Read More
 • వైఎస్ కుటుంబానికి హైందవంపై విశ్వాసం
  Published Date : 04-Nov-2017 3:57:47IST

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఏనాడూ డిక్లరేషన్ అడగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమనకరుణాకర్ రెడ్డి స్పష్టం చేశాడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలను దర్శించుకున్నారు, ఆ తర్వాత జగన్ కూడా దర్శించుకుంటున్నారు.. వైఎస్ కుటుంబానికి హైందవపై సంపూర్ణ విశ్వాసం ఉందని భూమన స్పష్టం చేశారు. ధర్మ ప్రచార పరిషత్ ను హిందూ ధర్మ ప్రచార పరిషత్ గా మార్చింది వైఎస్సారే అని, ఎస్వీబీసీ, కల్యాణమస్తు వంటి కార్యక్రమాలు ప్రారంభం అయ్యింది వైఎస్ హయాంలోనే అని భూమన గుర్తు చేశారు.

  Read More

 • Widget not in any sidebars
 • టీడీపీకి రాజీనామా.. బీజేపీలోకి నటీమణి!
  Published Date : 30-Oct-2017 8:08:23IST

  తెలుగుదేశం వాళ్లు తనను మెడబట్టి బయటకు గెంటేశారని అంటున్నారు సీనియర్ నటీమణి కవిత. కొన్నేళ్ల కిందట తెలుగుదేశంలో చేరిన కవిత కొన్నాళ్లుగా అసహనంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె అంటున్నారు. ఈ నేపథ్యంలో తను ఆ పార్టీ నుంచి బయటకు వస్తానని ఆమె ప్రకటించారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ నేతలతో కవిత సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.

  Read More
 • చంద్రబాబు నిధులు తెచ్చుకోలేని దద్దమ్మ!
  Published Date : 30-Oct-2017 7:25:42IST

  ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తాడు పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు తీరును రఘువీర దుయ్యబట్టాడు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు దద్దమ్మలా వ్యవహరిస్తున్నాడని, నిధులు తెచ్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు.. అని రఘువీరారెడ్డి ధ్వజమెత్తాడు. పోలవరం విషయంలో కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవాలని.. ఇది చేతగాక పోతే చంద్రబాబు నాయుడు పదవి నుంచి వైదొలగాలి అని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

  Read More
 • యనమల.. నోటిని ఫినాయిల్‌తో కడుక్కో!
  Published Date : 29-Oct-2017 1:18:54IST

  జగన్ పాదయాత్ర విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్టీఆర్ తో జగన్ పోలిక లేదని యనమల వ్యాఖ్యానించగా.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందే యనమల అని వైసీపీ నేత జోగి రమేశ్ ధ్వజమెత్తాడు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెనుకనుంచి వెన్నుపోటు పొడిస్తే.. యనమల రామకృష్ణుడు ముందునుంచి ఎన్టీఆర్‌ను పొడిచారని జోగి అన్నారు. మాట్లాడే ముందు యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో యనమల స్పీకర్ పదవికే మచ్చ తెచ్చారన్నారు.

  Read More

 • Widget not in any sidebars
 • చివరగా బాబును కలవకనే రేవంత్ రాజీనామా!
  Published Date : 29-Oct-2017 1:16:11IST

  తెలుగుదేశం అధినేతతో సమావేశానికి అని అమరావతికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ చంద్రబాబుతో సమావేశం కాకుండానే రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం ఒకసారి రేవంత్ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. శనివారం కూడా రేవంత్ బాబుతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాలేదు. రేవంత్ రెడ్డి బాబుతో సమావేశం కాకుండానే అక్కడి టీడీపీ ఆఫీసులో తన రాజీనామా పత్రాన్ని ఇచ్చేసి వచ్చాడు. దీంతో అమరావతికి వెళ్లింది వ్యర్థంగానే అని తెలుస్తోంది. రేవంత్ రాజీనామాపై బాబు మాట్లాడుతూ.. ఇవన్నీ మామూలే అన్నాడు.

  Read More
 • అలా అయితే అసెంబ్లీకి వస్తాం: వైఎస్సార్సీపీ
  Published Date : 26-Oct-2017 1:20:20IST

  అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే విషయమై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆ పార్టీ నిర్ణయించింది. అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరాలను మీడియాకు వివరించారు. ఫిరాయింపుకు పాల్పడిన 20మందిపై అనర్హత వేటు వేస్తేనే శాసనసభకు హాజరు అవుతామని ఆయన తెలిపారు.

  Read More
 • బీజేపీకి తలనొప్పిగా మారిపోయాడు!
  Published Date : 26-Oct-2017 1:17:05IST

  ఒకవైపు గుజరాత్ ఎన్నికలకు డేట్లు కూడా విడుదల కాగా..మరోవైపు హార్ధిక్ పటేల్ తలనొప్పి మాత్రం బీజేపీకి తగ్గడం లేదు. పటేల్ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన హార్ధిక్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్ధిక్ కాంగ్రెస్ ఏజెంట్ అని కమలం ఎదురుదాడి చేస్తున్నప్పటికీ.. ఆయన బీజేపీ పై తన మాటలతో ప్రతిదాడి చేస్తున్నాడు. తను రాహుల్ గాంధీని కలవబోతున్నాను అని హార్ధిక్ స్పష్టం చేస్తున్నాడు. తన మాటలతో బీజేపీకి మచ్చెమటలు పట్టిస్తున్నాడు ఈ ఉద్యమ నాయకుడు. అయితే సర్వేలు మాత్రం గుజరాత్ లో బీజేపీదే విజయం అంటున్నాయి.

  Read More