• ఇన్ స్టాగ్రమ్ ఫొటోతో ఇరుక్కున్న హీరోయిన్!

    Published Date : 11-Jan-2017 7:40:44 IST

    పరిణీతీ తన ఫాలోయర్ల దగ్గర బుక్కయ్యింది. ఈమె పోస్టు చేసిన ఒక ఫొటోపై తీవ్రమైన స్పందన వ్యక్తం అయ్యింది. దుబాయ్ లో షూటింగ్ లో ఉన్న ఈభామ అక్కడ నుంచి ఒకఫోటోను పోస్టు చేసింది. అందులో ఆమె సహాయకుడు ఒకరు మూడు బ్యాగులు మోస్తూ ఈమెకు గొడుగు పట్టి నడుస్తూ ఉంటాడు. పరిణీతి మాత్రం దర్జాగా నడుస్తూ ఉంటుంది. దీంతో దుమారం రేగింది. గొడుగును మోయడానికి సహాయకుడా? దాన్ని నువ్వే మోస్తే ఏం తరిగిపోవులే అంటూ ఫాలోయర్లు విరుచుపడటంతో ఆమె ఫొటోను తొలగించింది!

Related Post