• సమంత- నాగ చైతన్య నిశ్చితార్థం ఫొటో గ్యాలరీ
  Published Date : 30-Jan-2017 10:50:10 IST

  సింపుల్ గా అదే సమయంలో కనువిందుగా జరిగింది సమంత- నాగచైతన్య నిశ్చితార్థపు వేడుక. ఇది వరకూ సినిమాల్లో జంటగా, భార్యభర్తలుగా నటించిన ఈ జంట నిజ జీవితంలో వైవాహిక జీవితం వైపు మరో అడుగు వేసింది. ప్రేమలో మునిగి తేలి ఇప్పుడు పెళ్లి దిశగా వెళ్తోంది. పరిమిత ఆహ్వానితుల మధ్య వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. అక్కినేని కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఈ సంబరం జరిగింది. త్వరలోనే వీరి వివాహం ఘనంగా జరగనుంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటో గ్యాలరీ ఇది.

  Click Here To Read Full Article
 • టీఎస్సార్ మనవడి వివాహ వేడుకలో సెలబ్రిటీలు..
  Published Date : 30-Jan-2017 10:43:27 IST

  ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి తనయుడు కేశవ్ వివాహ వేడుకకు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సహా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, తమిళ సూపర్ రజనీకాంత్, పవన్ కల్యాణ్, వెంకటేష్, బాలకృష్ణ, నమ్రత తదితరులు హాజరయ్యారు. వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు.

  Click Here To Read Full Article
 • ఇన్ స్టాగ్రమ్ ఫొటోతో ఇరుక్కున్న హీరోయిన్!
  Published Date : 11-Jan-2017 7:40:44 IST

  పరిణీతీ తన ఫాలోయర్ల దగ్గర బుక్కయ్యింది. ఈమె పోస్టు చేసిన ఒక ఫొటోపై తీవ్రమైన స్పందన వ్యక్తం అయ్యింది. దుబాయ్ లో షూటింగ్ లో ఉన్న ఈభామ అక్కడ నుంచి ఒకఫోటోను పోస్టు చేసింది. అందులో ఆమె సహాయకుడు ఒకరు మూడు బ్యాగులు మోస్తూ ఈమెకు గొడుగు పట్టి నడుస్తూ ఉంటాడు. పరిణీతి మాత్రం దర్జాగా నడుస్తూ ఉంటుంది. దీంతో దుమారం రేగింది. గొడుగును మోయడానికి సహాయకుడా? దాన్ని నువ్వే మోస్తే ఏం తరిగిపోవులే అంటూ ఫాలోయర్లు విరుచుపడటంతో ఆమె ఫొటోను తొలగించింది!

  Click Here To Read Full Article
 • ఘనంగా అఖిల్ నిశ్చితార్థ వేడుక
  Published Date : 10-Dec-2016 6:51:57 IST

  ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపార వేత్త జీవీ కృష్ణా రెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్ తో శుక్రవారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. జీవీకే స్వగృహంలో ఈ కార్యక్రమం రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీల, ఇతర ప్రముఖుల హడావుడి కనిపించలేదు. అఖిల్ వివాహం విదేశాల్లో జరుగుతుందని ఇది వరకే ప్రకటించారు.

  Click Here To Read Full Article
 • క్రికెటర్ తో హీరోయిన్ సెల్ఫీ!
  Published Date : 22-Nov-2016 4:13:47 IST

  భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది నటి ఆండ్రియా. ఈ నటీమణి ధోనీని విమానంలో కలిసిందట. ఇది వరకూ సంగీత దర్శకుడు అనిరుధ్ తో చాలా సన్నిహితంగా గడుపుతూ సెల్ఫీలు దిగిన అనుభవం ఉంది ఆండ్రియాకు. అయితే.. వివాహితుడు అయిన ధోనీతో మాత్రం ఆమెకు సాన్నిహిత్యం ఏదీ లేదనే చెప్పాలి. కేవలం భారత క్రికెటర్ అనే అభిమానంతో మాత్రమే ఆమె సెల్ఫీ దిగినట్టుంది.

  Click Here To Read Full Article
 • తలసాని కూతురు వివాహ రెషెప్షన్ లో సెలబ్రిటీలు
  Published Date : 14-Nov-2016 9:32:46 IST

  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూతురు వివాహ రిషెప్షన్ కు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని దంపతులను విష్ చేశారు. నందమూరి బాలకృష్ణ, ప్రిన్స్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సినీ నటులు మనోజ్, అఖిల్, కృష్ణం రాజు, జగపతిబాబు, జీవిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు దాసరి తదితరులు రిషెప్షన్ కు హాజరయ్యారు.

  Click Here To Read Full Article
 • అమీ..టాప్ లెస్ తో అదరగొట్టేసింది!
  Published Date : 04-Nov-2016 11:16:42 IST

  అందాల భామ అమీ జాక్సన్ టాప్ లెస్ పోజులతో వేడెక్కిస్తోంది. తన అధికారిక ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా అమీ ఫొటోలను పోస్టు చేస్తోంది. ఈ పరంపరలో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో టాప్ లెస్ పోజుతో ఆకట్టుకుంది. ఇటు సినిమాలతో బిజీగానే ఉన్న అమీ ఈ విధంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రోబో-2లో అమీ నటిస్తోంది. దీంతో పాటు పలు తమిళ, హిందీ సినిమాలతో ఈ ఇండో బ్రిటన్ భామ బిజీగాఉంది.

  Click Here To Read Full Article
 • హీరోహీరోయిన్లు.. మ్యాగజైన్ కోసం హాట్ పోజు
  Published Date : 23-Oct-2016 3:04:07 IST

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, హీరోయిన్ వాణీ కపూర్ లు ఇప్పటికే పలు హాట్ పోజుల్లో కనిపించారు. యశ్ రాజ్ వారి సినిమా ‘భేఫికర్’ జంటగా నటిస్తున్న వీళ్లు లిప్ లాకులతో చర్చనీయాంశంగా మారారు. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ విడుదలైన లుక్స్ లో రణ్ వీర్ , వాణీలు కేవలం మూతి ముద్దుల్లో మాత్రమే కనిపించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో తాజాగా వాణీ రణ్ వీర్ లు మరో హాట్ పోజును ఇచ్చారు. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ లో భాగంగా వీరు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ లో కనిపించారు.

  Click Here To Read Full Article
 • సోనాక్షి..బికినీ పోజు!
  Published Date : 27-Sep-2016 11:22:55 IST

  కుటుంబ నేపథ్యంతోనో.. తండ్రికి చెడ్డపేరు తీసుకురాకూడదనో… ఇన్నేళ్లూ స్కిన్ షోకు దూరదూరంగానే ఉంది సోనాక్షి సిన్హా. హీరోయిన్ గా నటిస్తున్నా… ఎక్స్ పోజింగ్ విషయంలో మిగతా వాళ్లతో పెద్దగా పోటీపడలేదామె. పక్కా కమర్షియల్ సినిమాల్లోనే నటించినా పరిమితులు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మరి ఇందులో మార్పు చూపడానికో ఏమో.. బికినీ పోజు ఇచ్చింది సోనాక్షి. ఎక్కడో విహారయాత్రలో ఆ ఫొటో దిగి సోషల్ మీడియాలోకి షేర్ చేసిందామె. మరి ఈ పోజు ద్వారా బాలీవుడ్ కు ఏం చెప్పదలుచుకుందో!

  Click Here To Read Full Article
 • శ్రియా.. టెంప్టింగ్ పోజు!
  Published Date : 21-Sep-2016 3:57:30 IST

  34 యేళ్లు… ఆమె వయసుకు సంబంధించిన ఈ నంబర్ ను చెబితే నమ్మడం ఒకింత కష్టమే. అప్పుడెప్పుడో ఇష్టం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రియ లో ఆ లేలేతదనం లేకపోవచ్చు కానీ… ఆమె వన్నె తగ్గలేదు. అవకాశాలు తగ్గిపోయినా.. కొన్ని సినిమాల్లో అమ్మ పాత్రలే చేసినా, గ్లామర్ విషయంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నట్టుగా పోజులిస్తోంది ఈ ఢిల్లీ భామ. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శతకర్ణి’ తో బిజీగా ఉన్న శ్రియ తెలుగు, తమిళ భాషల్లో అవకాశాల వేటను కొనసాగిస్తోంది.

  Click Here To Read Full Article
 • ‘జనతా గ్యారేజ్’ విజయోత్సవ వేడుక గ్యాలరీ
  Published Date : 14-Sep-2016 3:40:29 IST

  జూనియర్ ఎన్టీఆర్ హీరో గా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించగా కొరటా శివ దర్శకత్వంలో రూపొందిన “జనతాగ్యారేజ్’ వజ్రోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సినిమా యూనిట్ తో పాటు సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి హాజరై అభిమానులను ఉర్రూతలూగించేలా ప్రసంగించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థ్యాంక్స్ మీట్ ఒకటి జరిగింది. ఇప్పుడు వజ్రోత్సవ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించారు.

  Click Here To Read Full Article
 • శ్రేయశర్మ ఫొటో గ్యాలరీ
  Published Date : 14-Sep-2016 3:31:03 IST

  మొన్నటి వరకూ బాలతార.. ఇప్పుడు వర్ధమాన నటి. “జై చిరంజీవ’’ సినిమాలో మెగాస్టార్ కు మేనకోడలిగా, “దూకుడు’’ సినిమాలో హీరో్యిన్ సమంతకు చెల్లెలుగా కనిపించిన శ్రేయ “నిర్మలాకాన్వెంట్’’ తో హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇకపై ఆ విధంగా రాణించడానికి సమాయత్తం అవుతోంది ఈ బొంబాయి భామ. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి తన ఉనికిని చాటుతోంది. హీరోయిన్ గా అవకాశాలను ఒడిసిపట్టడానికి ఈ విధంగా ప్రయత్నిస్తోంది. మరి హీరోయిన్ గా శ్రేయ కెరీర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి!

  Click Here To Read Full Article
 • బెంగళూరు బీభత్సం దృశ్యాలు…
  Published Date : 13-Sep-2016 7:43:03 IST

  కావేరీ జల వివాదంలో కన్నడీగులు భగ్గుమన్నారు. సొంత నగరం బెంగళూరులో విధ్వంసం సృష్టించారు. తమిళనాడుకు చెందిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ విధ్వంసంలో కొన్ని వందల వాహనాలు దగ్ధం అయ్యాయి. ఒకే బస్టాండ్ లో నిలిపిన 50 తమిళనాడు బస్సులకు నిప్పు పెట్టడంతో ఈ విధ్వంసం బీభత్సమైన స్థాయిలో జరిగింది. అలాగే అనేక వ్యక్తిగత వాహనాలపై కూడా కన్నడీగుల దాడులు కొనసాగాయి. తమిళుల కార్లను బైకులను ధ్వంసం చేశారు. తమిళనాడులో కూడా కన్నడీగులపై ఈ తరహా దాడులు కొన్ని జరిగాయి.

  Click Here To Read Full Article
 • ఇషా గుప్తా.. సూపర్ హాట్ పోజు!
  Published Date : 13-Sep-2016 6:51:14 IST

  “రుస్తుం’’ సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న ఇషాగుప్తా కు ఇప్పుడు చేతినిండా అవకాశాలున్నాయి. సెక్స్ బాంబ్ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా హాట్ హాట్ గా కనిపిస్తున్న ఈ భామను ఇప్పుడు అవకాశాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఫోటో షూట్ కోసం ఇషా ఇచ్చిన పోజు ఇది. ఎంతవారలైనా మతి చెడగొట్టే భంగిమను ఇచ్చింది ఈ భామ. ఇలంటి పొటో షూట్ల ను చూసే బాలీవుడ్ మొత్తం ఆమె వెనుక పడుతోంది. తమ సినిమాల్లో నటించమని వరస అవకాశాలిస్తోంది.

  Click Here To Read Full Article
 • సమంత ఫొటో గ్యాలరీ
  Published Date : 12-Sep-2016 4:19:59 IST

  అక్కినేని నాగచైతన్య తో సమంత వివాహం ధ్రువీకరణ అయినట్టే. గత కొంత కాలంలో అక్కినేని ఫ్యామిలీతో కలిసి వివిధ ఫంక్షన్ల కు వస్తున్న సమంత తనకు కాబోయే కోడలన్న విషయాన్ని నాగార్జున కూడా ప్రకటించేశారు. అయితే వివాహం ఎప్పుడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవైపు వివాహానికి సిద్ధం అవుతూ సమంత అటు సినీ కార్యక్రమాలతో బిజీగానే ఉంది. జనతా గ్యారేజ్ హిట్ కావడంతో ఆమె సంతోషంగా ఉంది. తాజాగా ఆమె ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫొటో గ్యాలరీ ఇది.

  Click Here To Read Full Article