• చరిత్ర గమనించుకో చంద్రబాబూ!
  Published Date : 29-Aug-2017 11:05:44 IST

  నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రనా తమ పార్టీ కథ అయిపోయిందని మాట్లాడటం సమంజసం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ధనబలంతోనే విజయం సాధించాడని వైకాపా నేత కొడాలి నాని వ్యాఖ్యానించాడు. చంద్రబాబు టీడీపీ బాధ్యతలు తీసుకున్నాకా మొత్తం 44 బై పోల్స్ జరిగితే వాటిల్లో టీడీపీ 21 సార్లు డిపాజిట్ కోల్పోయిందని నాని గుర్తు చేశాడు. రెండో లోక్ సభ పోల్స్ లో కూడా టీడీపీ డిపాజిట్ కోల్పోయిందని గుర్తుంచుకోవాలన్నాడు.

 • నాని మరోసారి నిర్మాతగా..!
  Published Date : 29-Aug-2017 11:04:36 IST

  ఇది వరకూ ఢీ ఫర్ దోపిడీ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు నాని. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ తదితరులు నటించిన ఆ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరి దాని సంగతలా ఉంటే.. ప్రస్తుతం వరుస విజయాల మీదున్న నాని నిర్మాతగా మారుతున్నాడట. షార్ట్ ఫిల్మ్ లతో ఆకట్టుకున్న ఒక యువ దర్శకుడిని వెండితెరకు పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మించనున్నాడట ఈ హీరో. మరి అందులో ఈ హీరో నటిస్తాడో, వేరే హీరోని పెడతాడో!

 • జయ టీవీపై హక్కులు వాళ్లకేనట..!
  Published Date : 29-Aug-2017 11:03:23 IST

  జయ మరణానంతరం తమిళనాడు రాజకీయ పరిణామాలు ఎన్ని మలుపులు తిరిగాయో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మరి ప్రస్తుతానికి అయితే ఈపీఎస్, ఓపీఎస్ లు కలిసిపోయినట్టుగా అగుపిస్తున్నారు. ఈ సంగతిలా ఉంటే.. ఇదే వేడిలో జయ టీవీ నెట్ వర్క్ ను, పార్టీ అనుబంధ పత్రికను స్వాధీనం చేసుకోవడానికి వీళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ మీడియా వర్గం పూర్తిగా దినకరన్ చేతిలో ఉంది. దీనిపై పార్టీకి ఎలాంటి హక్కులూ లేవని దినకరన్ అనుచరులు అంటున్నారు.


 • Widget not in any sidebars
 • ఆ సినిమాలకు కొత్త ఊపునిచ్చిన నాగార్జున
  Published Date : 28-Aug-2017 8:31:51 IST

  మలయాళీ మూవీ మేకర్లు ప్రతిపాదిస్తున్న ‘రండామూళం’సినిమాలో చేయనన్నట్టుగా ఇది వరకూ ప్రకటించిన నాగార్జున ఇప్పుడు ఆ సినిమా పట్ల సానుకూలంగా స్పందించాడు. ఆ సినిమాలో తనకు కర్ణుడి పాత్రను ఆఫర్ చేశారని నాగ్ చెప్పాడు. అంతే కాదు.. దాని పట్ల తను సానుకూలంగా ఉన్నట్టుగా చెప్పాడు. వచ్చే ఏడాది ఆ సినిమా ఆరంభం కానున్నదని వివరించాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాను కూడా చేయబోతున్నట్టుగా.. అందుకు కథ సిద్ధం అవుతున్నట్టుగా కూడా వివరించాడు.

 • తమన్నా.. మరో ఐటమ్‌సాంగ్
  Published Date : 28-Aug-2017 8:29:23 IST

  అందరి కోసం తను ఐటమ్‌సాంగ్స్ చేయను అనేది తమన్నా చెప్పే మాట.. అయితే ఇప్పుడు అడగాల్సిన ఒక హీరో అడిగేసరికి ఆమె ఓకే చెప్పిందట. ఇది ఎన్టీఆర్ కోసం. ‘జై లవకుశ’లో తమన్నా ఐటమ్ సాంగ్ చేయనుందని సమాచారం. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తమన్నాతో గ్లామర్ టచ్ ఇస్తున్నారట. ఇక తమ్మూ ఇది వరకూ బెల్లంకొండ సాయి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. అదంతా వారిపై అభిమానం కొద్దే అని ఆమె చెప్పింది. ఇప్పుడు ఎన్టీఆర్ పై అభిమానంతోనేమో!

 • డ్రగ్స్ కేసు విషయంలో బాలకృష్ణే అదుకున్నాడు!
  Published Date : 28-Aug-2017 8:27:20 IST

  ఇటీవలే డ్రగ్స్ వ్యవహారం లో పోలీసు విచారణకు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ఆ సమయంలో తనను బాలయ్య బాగా సపోర్ట్ చేశాడని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. బాలయ్య తన భార్యాపిల్లలకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడని, తన కోసం ఆ మాత్రం చేసిన ఏకైక హీరో బాలయ్యే అని కూడా పూరీ చెప్పాడు. ప్రస్తుతం బాలయ్య-పూరీల కాంబోలో వస్తున్న ‘పైసా వసూల్’ విడుదలకు సిద్ధం అవుతోంది. బాలయ్య ఎనర్జిటిక్ హీరో అని పూరీ చెప్పుకొచ్చాడు.


 • Widget not in any sidebars
 • వెంకయ్య సన్మాన సభపై తప్పని విమర్శలు
  Published Date : 26-Aug-2017 3:40:54 IST

  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తొలి సారిగా రాష్ట్రానికి వచ్చాడని అంటూ.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మానసభపై విమర్శలు తప్పలేదు. ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున విద్యార్థులను, మహిళలను తరలించడంపై విమర్శలు గుప్పుమన్నాయి. రోడ్డుకు ఇరువైపులా నిలబడి వెంకయ్యకు స్వాగతం పలకాలని అధికారులు వేల సంఖ్యలో విద్యార్థులను తరలించారు. కిలోమీటర్ల మేర వాళ్లను నిలబెట్టారు. ఈ హింస ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు

 • రాజుగారిగది 2..కొంత తెరుచుకుంది, మిగతాదెప్పుడంటే..
  Published Date : 26-Aug-2017 3:39:32 IST

  ఓం కార్ దర్శకత్వంలో అతడే ప్రధాన పాత్రలో నటించిన ‘రాజుగారిగది’ సినిమాకు సీక్వెల్ గా అతడి దర్శకత్వంలో ‘రాజుగారిగది-2’ వస్తోంది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తుండటమే ప్రత్యేక ఆకర్షణ. నాగ్ తో పాటు సమంత, సీరత్ కపూర్ లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన టైటిల్ లోగా తాజాగా విడుదల అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 29 వ తేదీన విడుదల చేయనున్నారు.

 • రజనీకాంత్.. రాజకీయాలా? సినిమాలేనా..?
  Published Date : 26-Aug-2017 3:37:03 IST

  రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలు రెండు ప్రస్తుతం క్యూలో ఉన్నాయి. కాలా, రోబో-2 ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. మరి ఇంతలోనే ఈ హీరో తదుపరి సినిమా అంటూ ఒక ప్రచారం మొదలైంది. దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో రజనీ హీరోగా ఒక సినిమా రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం మురుగ మహేశ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రజనీ, మురుగ కాంబోలో సినిమా అని ‘ఇండియాటుడే’ఒక కథనాన్ని ఇచ్చింది.


 • Widget not in any sidebars
 • కొత్త రికార్డు సాధించిన అజిత్ వివేగం!
  Published Date : 25-Aug-2017 1:44:26 IST

  మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల విషయంలో అజిత్ వివేగం తిరుగులేకుండా దూసుకుపోతోంది. చెన్నై బాక్సాఫీసు వద్ద ఈ సినిమా సరికొత్తరికార్డును సాధించింది. ఈ సినిమా తొలి రోజున చెన్నైలో రూ.1.21 కోట్లు రాబట్టిందని సమాచారం. ఇది వరకూ చెన్నైలో ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా మరోటి లేదు. విజయ్ తెరి రూ.1.05 కోట్లు, రజనీకాంత్ కబాలి రూ.1.12 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఆ రికార్డులను వివేగం సవరించింది.

 • నంద్యాల.. ఇంటెలిజెన్స్ సర్వే ఏం చెబుతోంది?
  Published Date : 25-Aug-2017 1:41:18 IST

  నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై బోలెడన్ని ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. కొన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్ కాంగ్రెస్ దే విజయం అని అంటుంటే.. మరికొన్ని విజయం తెలుగుదేశం పార్టీదే అని అంటున్నాయి. ఇలా భిన్నమైన ఎగ్జిల్ పోల్ సర్వేలు నంద్యాల ఫలితంపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఇంటెలిజెన్స్ సర్వేలో వైకాపాదే విజయం అనే మాట వినిపిస్తోంది. ఐదు వేల లోపు మెజారిటీతో వైకాపా గెలుస్తుందని ఇంటెలిజెన్స్ తేల్చిందట.

 • పండగ రోజున.. శ్రీవారి ఆలయంలో సమంత
  Published Date : 25-Aug-2017 1:38:51 IST

  నటీమణి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వేకుఝామున స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. వినాయకచవితి రోజున సమంత శ్రీవారిని దర్శించుకుంది. పండగ రోజున మరింత మంది సెలబ్రిటీలు శ్రీవారిని దర్శించుకున్నారు. క్రికెటర్ దినేష్ కార్తీక్ కూడా శ్రీవారిని దర్శించుకున్నాడు.


 • Widget not in any sidebars
 • ఓపీఎస్,ఈపీఎస్… కుదిరిన సయోధ్య!
  Published Date : 21-Aug-2017 5:10:10 IST

  తమిళనాట మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఓ పన్నీర్ సెల్వం, పళని సామి వర్గాలు చేతులు కలిపాయి. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన చేశారు. పన్నీరు పెట్టిన షరతులకు పళని ఓకే చెప్పాడని సమాచారం. పన్నీరుకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వనున్నారని.. అంతేగాక పన్నీరు వర్గంలని ముగ్గురికి మంత్రి పదవులను ఇవ్వడానికి ఈపీఎస్ ఓకే చెప్పాడని సమాచారం. శశికళను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా ఓకే చెప్పాడట.

 • దర్శకత్వంపై మరో హీరోయిన్ చూపు!
  Published Date : 21-Aug-2017 5:09:01 IST

  ఇది వరకటి కాలంలో చాలామంది హీరోయిన్లు దర్శకులుగా అవతారమెత్తారు. ఇప్పుడు ఈ జాబితాలో షామిలీ కూడా నిలిచే యత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలనటిగా ఎంతో పేరున్న షామిలీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. కొంత కాలం కెనడాకు వెళ్లి సినిమాలకు సంబంధించిన కోర్సు చేసి వచ్చింది. తిరిగి హీరోయిన్ గా నటించినా లక్ కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో ఈమె దర్శకత్వంపై కన్నేసిందని, ప్రొడ్యూసర్ దొరికితే డైరెక్షన్ చేయడానికి రెడీగా ఉందని సమాచారం.

 • నంద్యాల ఎన్నికలపై కోర్టులో పిటిషన్!
  Published Date : 21-Aug-2017 5:07:33 IST

  ప్రచార పర్వం ముగుస్తున్న దశలో నంద్యాల ఎన్నికలపై కోర్టులో పిటిషన్ పడింది. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని హైకోర్టులో సోమవారం రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్‌ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రలోభానికి గుర్తిచేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.